KA Movie : ట్రెడిషనల్ లుక్లో 'క' బ్యూటీ

KA Movie : ట్రెడిషనల్ లుక్లో క బ్యూటీ

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేస్తున్న కొత్త సినిమా 'క'. పీరియాడికల్ కాన్సెప్ట్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో వస్తున్న ఈ సినిమాను దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో 'తన్వీ రామ్' హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా 'క' సినిమా నుండి తన్వీ రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. రాధ పాత్రలో ట్రెడిషినల్ లుక్ లో కనిపిస్తున్న 'తన్వీ రామ్' ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మలయాళ '2018' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ 'క' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. మరి మొదటి సినిమాతో తెలుగు ఆడియన్స్ ను తన్వీ ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

Tags

Next Story