Tarak New Look : స్మార్ట్ & కూల్ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్

ఆస్కార్ తో అదరగొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు దర్శకుడు కొరటాల శివతో భారీ పాన్ ఇండియా చిత్రం దేవర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై గ్లోబల్ లెవెల్ లో హైప్ రాగా.. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రంతో పాటుగా తారక్ పలు యాడ్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తారక్ ప్రిపేర్ చేసిన లేటెస్ట్ లుక్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ తారక్ ని సూపర్ స్టైలిష్ గా ప్రిపేర్ చేయగా ఓ మిర్రర్ పిక్ ని అయితే తాను తీశాడు. ఇందులో ఎన్టీఆర్ స్మార్ట్ గా కూల్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే ఇది ఓ యాడ్ కోసం రెడీ చేసిన లుక్ కాగా తాజాగా ఆయన ఈ మేకోవర్ లోకి మారినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ పిక్ ఇప్పుడు ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కిక్ ఇస్తుండగా వైరల్ గా కూడా మారింది.
ఇటీవలే దేవర సినిమాపై మేకర్స్ ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఛత్రపతి సినిమాలోని ఒళ్లు గగుర్పొడిచే ప్రభాస్ ఎంట్రీ సీన్ రాజమౌళి ఏ రేంజ్ లో తెరకెక్కించాడో అందరికీ తెలిసిందే. ఈ సీన్ లో ప్రభాస్.. సొరచేపతో ఫైట్ చేస్తూ.. ఎక్కడలేని క్యూరియాసిటీని తెప్పిస్తాడు. ఈ సీన్‌కు థియేటర్‌లో సైతం విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దేవర సినిమాలోనూ కొరటాల ఓ భారీ యాక్షన్ సీన్‌ను డిజైన్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా లేటెస్ట్ బజ్ ప్రకారం సముద్రంలో ఓ భారీ షార్క్‌తో తారక్ ఫైట్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. ప్రభాస్ సొరచేపతో ఫైట్ చేసిన సీన్‌కు మనం ఏ రేంజ్‌లో ఫీల్ అయ్యామో.. దేవరలో అంతకు మించి ఫీల్ అవుతామని ఇన్‌సైడ్ టాక్.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్స్ట్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా దాదాపు సగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఎట్టిపరిస్థితుల్లో ఈ ఏడాదిలోపు షూటింగ్ పూర్తి చేసుకుని ఆపై నెల, రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్స్ జరపాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. ఇక ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ దేవరతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com