NTR - Alia Bhat ఎన్టీఆర్ ను అంచనా వేయలేం అన్న అలియా భట్

ఆర్ఆర్ఆర్ మూవీ టైమ్ లో ఇచ్చిన ప్రమోషన్స్ చూస్తే ఎన్టీఆర్, అలియా భట్ మధ్య మంచి రిలేషన్ ఉన్నట్టు అందరికీ అర్థం అయింది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా కొట్టుకుంటారో అలా అన్ని ఇంటర్వ్యూస్ లోనూ వీళ్లు ఫన్ క్రియేట్ చేశారు. సినిమాలో ఆమె రామ్ చరణ్ కు పెయిర్ అయినా.. బయట మాత్రం ఎన్టీఆర్ తోనే ఎక్కువగా కనిపించింది. టాలీవుడ్ కు రావడానికి చాలాకాలం ముందే తెలుగులో తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అని.. అతనితో నటించాలని ఉందనే విషయాన్ని చెప్పింది అలియా. సో.. అలియాకు అతనంటే అభిమానం అని వేరే చెప్పక్కర్లేదు.
ఈ అభిమానం వల్లే దేవర మూవీ ప్రమోషన్స్ లో తను కూడా భాగస్వామి అయింది అలియా. ఎన్టీఆర్, అలియా బాండింగ్ గురించి అందరికీ తెలుసు కాబట్టి.. ఈ ఇద్దరినీ కూర్చోబెట్టి కరణ్ జోహార్ ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇలాంటి ఇంటర్వ్యూస్ లో స్వ డబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బాలు కామన్ గానే ఉంటాయి కద.. ఎన్టీఆర్ ఏమో అలియాను బ్రలియంట్ యాక్ట్రెస్ అనేశాడు. ఆమె ఎన్టీఆర్ అన్ ప్రిడిక్టబుల్ ( అంచనా వేయలేని) యాక్టర్ అని చెప్పింది. అయితే ఇద్దరి టాలెంట్ గురించి అందరికీ తెలుసు కాబట్టి ఇది మరీ డబ్బా అనుకోలేం. విశేషం ఏంటంటే.. తెలుగులో కొరటాల కూడా సిద్ధు, విశ్వక్ సేన్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఇలాగే చెప్పాడు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూలో ఇంకెన్ని స్పెషల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com