Taraka Ratna : తారకరత్నకు విదేశీ వైద్యుల చికిత్స

Taraka Ratna : తారకరత్నకు విదేశీ వైద్యుల చికిత్స
X
తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో వైద్యం అందుతుంది

హార్ట్ ఎటాక్ కు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో వైద్యం అందుతుంది. జనవరి 28న కుప్పంలో అస్వస్థతకు గురైన తారకరత్నను బెంగళూరుకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా విదేశీ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

తారకరత్నను ఆయన బాబాయ్ నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇదివరకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారాలోకేష్, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించారు. తారకరత్న కుటుంబ సభ్యులు బెంగళూరులోనే ఉంటూ సేవలు అందిస్తున్నారు. తారకరత్న కోలుకోవాలని నందమూరి అభిమానులు పూజలు చేస్తున్నారు.

Tags

Next Story