Tarakaratna: తాత పేరు కలిసి వచ్చేలా.. ముగ్గురు తనయులకు ముచ్చటగా..
Tarakaratna: నందమూరి ఫ్యామిలీకి తాత నందమూరి తారకరామారావు అంటే వల్లమాలిన ప్రేమ. ఆయన నీడలో పెరిగి పెద్దవారైనా అంతే అభిమానము, ఆత్మీయత.. మనవళ్లు, మనవరాళ్లు తమ పిల్లలకు తాత పేరు పెట్టుకుని తమ ప్రేమను చాటుకున్నారు. అందులో నందమూరి తారకరత్న కూడా ఒకరు. చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయిన తారకరత్న వివాదాస్పదుడు.
ఆయన తన ముగ్గురు పిల్లలకు తాత పేరు కలిసి వచ్చేలా పెట్టుకున్నారు. NTR పేరులోని మొదటి అక్షరంతో Nతో నిషిక, రెండో అక్షరం Tతో కొడుకు పేరు తనయ్ రామ్ అని, మూడో అక్షరం Rతో రేయా అని మూడో అమ్మాయికి పేర్లు పెట్టుకున్నారు.
తారకరత్న మరణంతో పిల్లల బాధ్యతలు బాలకృష్ణ తీసుకున్నట్లు తెలుస్తోంది. బాబాయి బాలయ్య అంటే తారకరత్నకు ఎనలేని ప్రేమ. తన చేతిపై బాలకృష్ణ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఇరుకుటుంబాలకు ఇష్టం లేకపోయినా ప్రేమ వివాహం చేసుకున్న తారకత్నకు బాలకృష్ణ సపోర్ట్‌గా నిలిచి కుటుంబసభ్యుల మధ్య సయోధ్య కుదిర్చారు. అప్పటి నుంచి బాబాయి అంటే మరింత ప్రేమ తారకత్నకు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com