Taran Adarsh Health Update: నిలకడగా సినీ విశ్లేషకుని ఆరోగ్యం

ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్, విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా కమల్ ఆర్ ఖాన్ X లో ఈ వార్తలను పంచుకున్నారు. ఆదర్శ్ ఒక వారం పాటు ఆసుపత్రిలో ఉన్నారని తెలియజేశారు. అయితే దీనిపై స్పందించేందుకు ఆయన కుటుంబ సభ్యులు నిరాకరించారు. "అవును అతను కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరాడు. కుటుంబం వ్యాఖ్యానించడానికి ఇష్టపడడం లేదు" అని ఒక ట్వీట్‌లో, KRK తెలిపాడు. "గత వారం నుండి, తరణ్ ఆదర్శ్ తన చికిత్స కోసం కోకిలాబెన్ ఆసుపత్రిలో ఉన్నారు. దయచేసి అతని కోసం ప్రార్థించండి" అని కోరారు.
Since last one week, Critic #TaranAdarsh is in Kokilaben hospital for his treatment. Pls Pray for him.
— KRK (@kamaalrkhan) December 14, 2023
ఆ తరువాత, ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ X కి తీసుకొని తన హెల్త్ అప్ డేట్ ను పంచుకున్నారు. "ఆందోళన, శుభాకాంక్షలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు... చాలా సంవత్సరాలుగా అనారోగ్యంతో పోరాడుతున్నాను. కానీ గత పక్షం రోజులుగా అది మరింత దిగజారింది... శస్త్రచికిత్స చేయించున్నాను. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాను... దేవుడు దయ తలిస్తే నేను మళ్లీ కోలుకుని వస్తాను.. మరోసారి ధన్యవాదాలు, మీ శ్రద్ధ, ప్రేమకు నిజంగా అభినందిస్తున్నాను" అని అన్నారు.
Thank you everyone for the concern and wishes… Had been battling a health ailment for several years now, but it got worse last fortnight… Underwent a surgery and am currently recovering at the hospital… God willing, I will be back to work soon… Thank you once again, genuinely…
— taran adarsh (@taran_adarsh) December 14, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com