Draupathi 2 Movie : ‘ద్రౌపది 2’ నుంచి ‘తారాసుకి..’ సాంగ్ రిలీజ్

నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మిస్తోన్నభారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. సినిమాలో రిచర్డ్ రిషి హీరోగా ,రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను, నెలరాజె.. అనే పాటను విడుదల చేయగా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా బుధవారం రోజున ఈ సినిమా నుంచి ‘తారాసుకి..’ అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మహ్మబీన్ తుగ్లక్ పాత్రలో నటిస్తోన్న చిరాగ్ జానీపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట కోసం భారీ సెట్ వేసి మరీ చిత్రీకరించారు. పీరియాడిక్ టచ్‌తో సాగే ఈ పాట మంచి బీట్‌తో ఆకట్టుకుంటోంది. జిబ్రాన్ సంగీత సారథ్యంలో చిత్ర దర్శకుడు మోహన్.జి రాసిన ఈ పాటను జిబ్రాన్, గోల్డ్ దేవరాజ్, గురు హరిరాజ్ ఆలపించారు.
సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ద్రౌపది 2 నుంచి త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్‌పై కూడా ప్రకటన త్వరలోనే రానుందని మేకర్స్ పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

