Tarun Bhaskar : తరుణ్ భాస్కర్ ఓ గాయపడ్డ సింహం

ఈ మధ్య దర్శకత్వానికి ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పెట్టాడు అనేలా ఉన్నాడు తరుణ్ భాస్కర్. వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. పైగా తనే హీరోగానూ మెప్పిస్తున్నాడు. రీసెంట్ గా ఓమ్ శాంతి శాంతి శాంతిః అనే మూవీలో మెయిన్ లీడ్ లో నటించాడు. ఇదో మళయాల మూవీ రీమేక్. అందుకే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా తగ్గేదే లే అన్నట్టుగా దూసుకుపోతున్నాడు తరుణ్ భాస్కర్. అతని నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.
తరుణ్ భాస్కర్ కొత్త సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ‘గాయపడ్డ సింహం’అనేదే ఆ టైటిల్. అతనితో పాటు ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్ లోనూ.. జే.డి. చక్రవర్తి ఓ కీలక పాత్రలోనూ కనిపించబోతున్నాడు. మరి ఇలాంటి పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్నారు అంటే కంటెంట్ కూడా అదే స్థాయిలో ఎక్స్ పెక్ట్ చేస్తాం. కాకపోతే ఒక్కోసారి ఈ టైప్ టైటిల్స్ తో కామెడీ మూవీస్ కూడా వస్తుంటాయి. మరి ఈ మూవీ డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. నిర్మాణ సంస్థ మాత్రం సప్త అశ్వ మీడియా వర్క్స్ ట. మరి ఈ మూవీ ఎలా ఉండబోతోందో అనేది చూడాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
