Raashii Khanna : రాశిఖన్నా అఫీషియల్ ఎంట్రీ

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. తమిళ్ లో విజయ్ హీరోగా నటించిన తెరి (తెలుగులో పోలీసోడు గా డబ్ అయింది)కి ఇది రీమేక్. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టేటస్ ను బట్టి చాలా మార్పులు చేశారని చెబుతున్నారు. మామూలుగా ఈ చిత్రంలో ముందుగా శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. గత ఏపి ఎన్నికలకు ముందే స్టార్ట్ అయిన ఈ చిత్రం బాగా లేట్ అయింది. అందుకే శ్రీ లీల తప్పుకుంటుంది అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తను తప్పుకోలేదు. ఒరిజినల్ లో ఎమీ జాక్సన్ చేసిన స్కూల్ టీచర్ పాత్ర ఉంది కదా.. అందులో శ్రీ లీల నటిస్తోంది. తెలుగులో ఈ పాట్రను రేడియో జాకీగా మార్చారని టాక్. ఇక సమంత పాత్రలో రాశిఖన్నాను తీసుకున్నారు అనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. వాటిని అఫీషియల్ గా కన్ఫార్మ్ చేసింది మూవీ టీమ్.
తెరిలో సమంత పాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ పాత్ర చనిపోతుంది. అలాంటి రోల్ లో రాశిఖన్నా అంటే ప్రస్తుతం పెద్దగా ఫేమ్ లో లేని తనకు ఇది పెద్ద ఆఫర్ అనే చెప్పాలి. ఈ చిత్రంలో తన పాత్ర పేరు శ్లోక అంటూ పరిచయం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయబోతున్నాడు పవన్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com