Acharya Siddha Teaser: 'ఆచార్య' నుండి రామ్ చరణ్ టీజర్ విడుదల..

SiddhasSaga (tv5news.in)
Acharya Siddha Teaser: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చాలారోజుల క్రితమే విడుదల అవ్వాల్సి ఉన్నా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి రామ్ చరణ్ చేస్తున్న సిద్ధ పాత్రకు సంబంధించి ఓ టీజర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్.
ముందుగా ఆచార్యలో ఓ కీలక పాత్ర కోసం రామ్ చరణ్‌ను ఎంపిక చేశారు కొరటాల శివ. కానీ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యాక ఇది పూర్తిగా మల్టీ స్టారర్‌లాగా మారిపోయింది. ఇందులో దాదాపు చిరంజీవికి సమానంగా రామ్ చరణ్‌కు స్క్రీన్ స్పేస్ దొరికింది. ఇప్పటివరకు ఆచార్య నుండి విడుదలయిన పోస్టర్లు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర పేరు సిద్ధ అని మూవీ టీమ్ చాలాకాలం క్రితమే పోస్టర్ ద్వారా స్పష్టం చేసింది. అంతే కాకుండా ఇందులో రామ్ చరణ్‌కు జంటగా నటించిన పూజా హెగ్డేతో కలిసి చేసిన నీలాంభరి అనే ఫీల్ గుడ్ మెలోడీ ఇటీవల విడుదలయ్యి మంచి ఆదరణను సంపాదించుకుంటోంది. ఇక ప్రత్యేకంగా తాజాగా విడుదలయిన సిద్ధ టీజర్ కూడా అప్పుడే సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది.
ఈ టీజర్‌ను బట్టి రామ్ చరణ్.. ధర్మస్థలి అనే అడవి మధ్య ఉండే గ్రామంలో నివసించే యువకుడిగా కనిపిస్తున్నట్టు అర్థమవుతోంది. అంతే కాకుండా తన ఊరిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమయిన వెళ్లే ధైర్యం కూడా సిద్ధలో ఉన్నట్టుగా చూపించారు దర్శకుడు కొరటాల శివ. ఇక ఈ టీజర్ చివర్లో రామ్ చరణ్‌తో పాటు చిరంజీవిని కూడా ఒకే ఫ్రేమ్‌లో చూపించి మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు.
#SiddhasSaga Teaser out now 🔥
— Ram Charan (@AlwaysRamCharan) November 28, 2021
▶️ https://t.co/k0tlj3HDyd#Acharya #AcharyaOnFeb4th
Megastar @KChiruTweets #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro @adityamusic
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com