Teja Sajja's Mirai : సెంచరీ కొట్టిన మిరాయ్

తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రీయ శరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన మిరాయ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టేసింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సూపర్ హీరో మూవీకి దేశవ్యాప్తంగా మంచి అప్లాజ్ వచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచకపోవడంతో వంద కోట్ల మార్క్ చేరడానికి కాస్త టైమ్ పట్టింది. లేదంటే వీకెండ్ కే సెంచరీ పూర్తయ్యేది అంటున్నారు విశ్లేషకులు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఈ చిత్రంతో భారీ విజయం దక్కిందనే చెప్పాలి.
అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో పాటు మంచి కథ, కథనాలతో రూపొందిన మిరాయ్ తో తేజ సజ్జా ఖాతాలో మరో వంద కోట్ల మూవీ చేరింది. ఇంతకు ముందు హను మాన్ తో ఆ మార్క్ ను ఫస్ట్ టైమ్ టచ్ చేశాడు. ఇక మిరాయ్ 100 కోట్ల మార్క్ తో పాటు ఓవర్శీస్ లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లో కూడా చేరింది. కంటెంట్ పరంగానే కాక టెక్నికల్ గా కూడా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఎఫర్ట్ తో కనిపించిన మిరాయ్ 300 కోట్ల క్లబ్ లో చేరుతుంది అనుకున్నారు చాలామంది. అయితే అందుకు కాస్త ఎక్కువ టైమ్ పట్టొచ్చు అనిపిస్తోంది ఇప్పటి ట్రెండ్ చూస్తుంటే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com