Tejasswi Prakash: బిగ్ బాస్ విన్నర్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 130 కోట్ల బడ్జెట్‌తో సీరియల్..

Tejasswi Prakash (tv5news.in)
Tejasswi Prakash: మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఏ భాషలో అయినా చాలా ఫేమస్. కానీ హిందీలో అయితే దీనికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.. ముందుగా ఈ రియాలిటీ షో హిందీలోనే మొదలయ్యింది కాబట్టి అక్కడ దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇతర భాషా ప్రేక్షకులు కూడా హిందీ బిగ్ బాస్‌ను చూడడానికి ఇష్టపడతారు. అందుకే తాజాగా బిగ్ బాస్ విన్నర్ అయిన కంటెస్టెంట్‌తో బాలీవుడ్.. ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌నే ప్లాన్ చేసింది.
హిందీ బిగ్ బాస్ ఇప్పటికి సక్సెస్‌ఫుల్‌గా 15 సీజన్లను పూర్తి చేసుకుంది. తాజాగా బిగ్ బాస్ 15 గ్రాండ్ ఫైనల్ గ్రాండ్‌గా ముగిసింది. బిగ్ బాస్ సీజన్ 15 విన్నర్‌గా నిలిచింది బుల్లితెర నటి తేజస్వీ ప్రకాశ్. హిందీలో పలు సీరియళ్లలో కనిపించిన ఈ మరాఠీ భామ.. మామూలు నటిగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుని బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచింది.
బిగ్ బాస్ విన్నర్ అయిన తేజస్వీ ప్రకాశ్.. అలా హౌస్ నుండి బయటికి రాగానే ఇలా తన చేతినిండా ఆఫర్లు వచ్చిపడ్డాయి. అందులో ఒకటి 'నాగిన్'. నాగిన్ సీరియల్ హిందీలోనే కాదు.. సౌత్ భాషల్లో కూడా చాలా ఫేమస్. ఇప్పటికే ఈ సీరియల్‌లో లీడ్ రోల్ చేసిన మౌనీ రాయ్.. వెండితెరపై కూడా తన సత్తాను చాటుకుంది. ప్రస్తుతం నాగిన్ సీరియల్‌కు 6వ సీజన్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
నాగిన్ 6వ సీజన్‌లో తేజస్వీ ప్రకాశ్‌ను లీడ్‌గా ఎంపిక చేసింది టీమ్. అయితే హైలెట్ విషయం మరొకటి ఉంది. ఈ సీరియల్‌ను ఏకంగా రూ.130 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాలని ప్లాన్ చేస్తోందట నిర్మాత ఏక్తా కపూర్. ఇప్పటివరకు ఏ సీరియల్‌కు ఇంత బడ్జెట్ పెట్టలేదు. ఎంత గ్రాండ్‌గా తెరకెక్కించే సీరియల్ అయినా రూ.100 కోట్లను మించలేదు. అందుకే నాగిన్ సీరియల్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది. ఫిబ్రవరి 12 నుండి ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com