Devara : దేవర టికెట్ రేట్ల పెంపు .. -జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
X
By - Manikanta |24 Sept 2024 12:00 PM IST
దేవర సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తొలి రోజైన సెప్టెంబర్ 27న దేవర సినిమా ఒక్కో టికెట్‍పై రూ.100 అదనంగా ధర పెంచేందుకు సర్కార్ ఓకే చెప్పింది. ఆ తర్వాత తొమ్మిది రోజులు తెలంగాణవ్యాప్తంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‍పై రూ.50, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‍పై రూ.25 రేటును పెంచుకునేందుకు ఓకే చెప్పింది. తెలంగాణవ్యాప్తంగా దేవర తొలి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆరు షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రెండో రోజు నుంచి పదో రోజు వరకు ప్రతీ రోజు ఐదు షోలకు ఓకే చెప్పింది. తొలి రోజు అర్ధరాత్రి 1 గంట షోకు మాత్రం 29 థియేటర్లకే తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com