Pushpa 2 : పుష్ప 2 పై తెలంగాణ సర్కార్ వరాల జల్లు

Pushpa 2 :  పుష్ప 2 పై తెలంగాణ సర్కార్ వరాల జల్లు
X

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప 2 చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఈ చిత్రానికి ఏకంగా ముందు రోజు నుంచే బెన్ ఫిట్ షోస్ ప్రదర్శించుకునేందుకు అనుమతిచ్చింది. అంటే డిసెంబర్ 4నే రాత్రి 9:30 ఆటకు అనుమతినిచ్చింది. అంతే కాదు.. ఈ షో కోసం 800 టికెట్ రేట్లు పెట్టుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. అదే రోజు అర్థరాత్రి నుంచి ఆరు, ఏడు షోస్ ప్రదర్శించుకోవచ్చని చెప్పింది. ఈ షోస్ 5వ తేదీన అర్థరాత్రి 1 గంటకు, ఉదయం 4 గంటలకు మొదలవుతాయి.

ఇక సింగిల్ స్క్రీన్స్ లో డిసెంబర్ 5 నుంచి 8 వరకూ ఇప్పుడు ఉన్న టికెట్ ధరలకు అదనంగా 150 రూపాయలు టికెట్ ధరలను పెంచుకోవచ్చని చెప్పింది. 9 నుంచి 16 వరకూ 105 రూపాయలు హైక్ చేసుకోవచ్చట. ఆ తర్వాత 17 నుంచి 23వ తేదీ వరకు 20 రూపాయల చొప్పున టికెట్ ధరలను పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.

మల్టీప్లెక్స్ లతో పాటు మల్టీ ప్లెక్స్ లలో డిసెంబర్ 5 నుంచి 8 తేదీ వరకు ఇప్పుడు ఉన్న టికెట్ ధరలకు అదనంగా 200 రూపాయలు పెంచుకోవచ్చు. అలాగే 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ 150రూపాయలు పెంచుకోవచ్చు. ఆ తర్వాత 17 -23 50 రూపాయలు పెంచుకోవడానికి ఫుల్ పర్మిషన్ ఇచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ధరలన్నిటికీ జీఎస్టీ అప్లై అవుతుందని చెప్పింది.

ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డర్ ఇచ్చింది.

మొత్తంగా 4వ తేదీన రాత్రి 9.30 గంటల ఆట చూడాలనుకుంటే 800 రూపాయలు టికెట్ ధర అవుతుంది. ఆ తర్వాత ఎలా చూసినా సింగిల్ స్క్రీన్స్ లో ఒక్కో టికెట్ కు 300రూపాయలకు పైనే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మల్టీ ప్లెక్స్ లలో సినిమా చూడాలనుకుంటే 500 రూపాయలు టికెట్ ధరలు చెల్లించాల్సిందే. ఏదేమైనా ఇది సామన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేదే అని చెప్పాలి. కాకపోతే మైత్రీ మూవీ మేకర్స్ కు మాత్రం కాసుల పంట పండుతుంది. తెలంగాణలో వాళ్లే సోలోగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. కాబట్టి సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. కనకవర్షమే ఇంక.




Tags

Next Story