Robinhood : ఆ డ్యాన్స్ లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

Robinhood :   ఆ డ్యాన్స్ లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
X

తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ కు దబిడి దిబిడి వార్నింగ్ ఇచ్చింది. నిజానికి చాలామంది మనసులోని మాట కూడా ఇది. జనాలు అనుకుంటే సోషల్ మీడియా వరకే పరిమితం అవతుంది అనుకోవడానికి లేదు. సరైన వారికి చేరితే అందులో తప్పు ఉందీ అనిపిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అదే టైమ్ లో ప్రస్తుతం ప్రపంచం ఏ దిశగా వెళుతోంది అనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నైతికత అనేది ప్రాధాన్యతగా చూడాలి. ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పిందీ అంటే.. కొన్నాళ్లుగా తెలుగు సినిమా డ్యాన్సుల్లో వింత పోకడలు కనిపిస్తున్నాయి. ఆడవాళ్ల అంగాంగాలను అదే పనిగా టచ్ చేస్తూ.. కాస్త వల్గర్ గా ఇంకాస్త ఎబ్బెట్టుగా ఉండేలా ‘నృత్య భంగిమలు’ సమకూరుస్తున్నారు డ్యాన్స్ మాస్టర్స్. అది వారి స్టైలా లేక దర్శకులు అడిగితే అలా చేశారా అనేది తర్వాతి మేటర్ అయితే ఈ స్టెప్పులను చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ రీ క్రియేట్ చేస్తూ చూడ్డానికి మరింత అసహ్యంగా తయారవుతోంది సమాజం. అందుకే

ఆ మధ్య వచ్చిన మిస్టర్ బచ్చన్ స్టెప్పులు విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నాయి. దానికి దర్శకుడు సమర్థించుకోవాలని చూసిన విధానం కూడా అసహ్యంగా అనిపించింది.

పుష్ప 2లోనూ అదే తరహాలో దాదాపు ఆడమగ కలిసి రెజ్లింగ్ చేస్తున్నారా అన్న స్థాయిలో ఉన్నాయి స్టెప్పులు. వీటిని పిల్లలు సైతం రీల్స్ గా రీ క్రియేట్ చేస్తున్నారు. అందులోని అర్థం అప్పుడే వారికి తెలియకపోవచ్చు. కానీ పేరెంట్స్ కూడా వదిలేస్తున్నారు. బాలకృష్ణ డాకూ మహారాజ్ లో దబిడి దిబిడి పాట గురించి ఏం చెబుతాం. జాతీయ స్థాయిలో ఈ పాటపై విమర్శలు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా రాబోతోన్న రాబిన్ హుడ్ నుంచి అది దా సర్ ప్రైజ్ అంటూ కంపోజ్ చేసిన స్టెప్పులు సైతం అభ్యంతరకరంగా ఉన్నాయి. అందుకే వీటిపై తెలంగాణ మహిళా కమీషన్ సీరియస్ అయింది.

ఇకపై ఇలా అభ్యంతరకరమైన, అసభ్యకరమైన రీతిలో నృత్య భంగిమలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించింది. విశేషం ఏంటంటే.. ఇలాంటి పాటలు ఉంటే దర్శకులు, కొరియోగ్రాఫర్స్ తో పాటు ఆ పాటలో డ్యాన్స్ చేసిన వాళ్లపైనా చర్యలు తీసుకుంటాం అంటన్నారు. పాటకు సంబంధించి వెనక (కొరియోగ్రాఫర్ లేదా దర్శకులు) ఆడవాళ్లు ఉన్నా వదిలిపెట్టం అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే చేతిలో సెల్ ఫోన్ లోనే చాలా దారుణాలు చూస్తున్నాం. ఇదో లెక్కా అని కొందరు అనుకోవచ్చు. బట్ ఆ దారుణాలను ఆపలేకపోయినా కట్టడి చేయడానికి ఇదో మార్గం అని కూడా అనుకోవచ్చేమో.

Tags

Next Story