Bigg Boss: నోరువిప్పిన ప్రేమకావాలి బ్యూటీ.. బిగ్‎బాస్ ఎంట్రీపై క్లారిటీ

Bigg Boss: నోరువిప్పిన ప్రేమకావాలి బ్యూటీ.. బిగ్‎బాస్ ఎంట్రీపై క్లారిటీ
Bigg Boss 5: బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు వార్తలు, లీకులు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులోకి బిగ్ బాస్ షో మొదలైన సమయంలో దీన్ని ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఊహించని విధంగా ఈ షోను సూపర్ హిట్ చేశారు. బిగ్ బాస్(bigg boss) నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే బిగ్‎బాస్‎లో వచ్చే కంటెస్టెంట్లకు వచ్చే ఫాలోయింగ్ మాములుగా ఉండదు. బిగ్ బాస్ షో ద్వారా జనాల్లో వారి మంచి గుర్తింపు వస్తుంది. ఇక త్వరలోనే 5వ సీజన్ కూడా మొదలవబోతుంది. ఇటీవలే బిగ్‌బాస్‌-5 లోగోని విడుదల చేసింది స్టార్ మా చానల్. దీంతో బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు వార్తలు, లీకులు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక తాజాగా ప్రేమకావాలి మూవీ ఫేమ్ ఇషాచావ్లా బిగ్‌ బాస్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బిగ్ బాస్ ఎంట్రీ గురించి ఇషా చావ్లా ఎంట్రీపై నెటిజన్లు ఇన్ స్టాలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఇషాచావ్లా బిగ్ బాస్ ఎంట్రీపై స్పందించింది. తాను బిగ్ బాస్ షోకి వెల్లడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే బిగ్ బాస్ ఎంట్రీపై నటి సురేఖా వాణి, యాంక‌ర్ ర‌వి, వ‌ర్షిణి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా కొందరి ప్లేరు బయటకు వస్తున్నాయి. ఇషాచావ్లా విషయానికి వస్తే.. ప్రేమకావాలి సినిమాత ో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత పూలరంగడు, శ్రీమన్ నారాయణ, జంప్ జీలాని, మిస్టర్ పెళ్లి కొడుకు వంటి సినిమాల్లో నటిచింది.

Tags

Next Story