ఈ టాలీవుడ్ హీరోయిన్‎ని గుర్తు పట్టారా.. రీ ఎంట్రీ కోసమేనా..?

ఈ టాలీవుడ్ హీరోయిన్‎ని గుర్తు పట్టారా.. రీ ఎంట్రీ కోసమేనా..?
Tollywood: సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. సెలబ్రిటీలు పెట్టే పోస్టులను వారి ఫ్యాన్స్ రోజు ఫాలో అవుతారు.

Tollywood: సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. సెలబ్రిటీలు పెట్టే పోస్టులను వారి ఫ్యాన్స్ రోజు ఫాలో అవుతారు. దీంతో ప్రముఖులు పెట్టే పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జయం. ఈ మూవీతో సదా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడడంతో.. సదా స్టార్ హోదా దక్కించుకుంది. ఆతర్వాత తమిళంలో విక్రమ్ సరసన అపరిచితుడు వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో హీరోయిన్ గా నటించి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది.


అయితే సదా తర్వాత కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరం జరిగింది. సదా సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలను చూస్తే ఈ అమ్మడు మళ్ళీ ఇప్పుడు రీ ఎంట్రీ కోసం ట్రై చేస్తున్నట్లు అర్థమవుతుంది. సదా స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోలను తన ఇష్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. వావ్ అంటూ కామెంట్స్ తో దుమ్మురేపు తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసే ఈ అమ్మడు స్విమ్ సూట్ లో స్వమ్మింగ్ పూల్ లో ఈతకొడుతూ బోల్డ్ గా కనిపించడంతో పాటు హలొ సండే అనే టాగ్ తగిలించింది. తెలుగులో దొంగ దొంగది,చుక్కల్లో చంద్రుడు, ఔవునన్నా కాదన్నా, శంకర్ దాదా జిందాబాద్ వంటి మూవీస్ లో నటించింది.







Tags

Read MoreRead Less
Next Story