Telugu Big Boss : తెలుగు బిగ్ బాస్-8 .. ఫైనల్ లిస్ట్ ఇదే

ఎక్కడో మొదలైన బిగ్ బాస్ అనే రియాలిటీ షో ఇండియాకు వచ్చిన తర్వాత హిందీకే పరిమితం అయ్యింది. ఈ డెకేడ్ లో ఇతర భాషలకూ విస్తరించింది. సెలబ్రిటీస్ నుంచి కాస్తో కూస్తో పేరున్న ఆర్టిస్టులు, ఫేమ్ ఉన్నవాళ్లలో కొందరిని సెలెక్ట్ చేసి ఒకే ఇంట్లో పెట్టి వారి మనస్తత్వాలు, వ్యక్తిత్వాల గురించి ప్రజలకు తెలిసేలా నిర్వహించే ఈ షో తెలుగులోనూ విజయం సాధించింది. ఫస్ట్ సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. నెక్ట్స్ సీజన్ నాని హోస్ట్ చేశాడు. థర్డ్ సీజన్ నుంచి ఇప్పటి వరకూ అక్కినేని నాగార్జునే హోస్ట్ గా ఉన్నాడు. 5, 6 సీజీన్స్ కు యావరేజ్ అనే టాక్ వచ్చింది. దీంతో 7వ సీజన్ ను పకడ్బందీగా నిర్వహించారు. అది సూపర్ హిట్ అయింది. ఈ సారి కూడా మరింత టఫ్ కాంపిటీటర్స్ తోనే హౌస్ ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఈ సీజన్ లో హౌస్ లోకి ఎంటర్ అయ్యేది వీళ్లే అంటూ ఒక ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.
ఆ లిస్ట్ లో ఉన్నది వీరే.
1. రాజ్ తరుణ్ - నటుడు
2. తేజస్విని గౌడ - నటి
3. శివ - నటుడు
4. నిఖిల్ - యాంకర్
5. బంచిక్ బబ్లు - యూ ట్యూబర్
6. దీపిక - నటి
7. శ్వేతా నాయుడు - నటి
8. ఇంద్రనీల్ - నటుడు
9. సద్దాం - హాస్య నటుడు
10. యాదమ్మ రాజు - హాస్య నటుడు
11. సన - సీనియర్ నటి
12. వేణు స్వామి - ఆస్ట్రాలజర్
13. కిరాక్ ఆర్పీ - కమెడియన్
14. ఖయ్యూం - నటుడు
వీరిలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న పేరు రాజ్ తరుణ్. రెండు వారాల్లో రెండు సినిమాలు విడుదలయ్యాయి. దీనికి తోడు బిగ్ బాస్ కంటే హాట్ గా అనిపించేలా అతని మాజీ లవర్ లావణ్య చేస్తోన్న హంగామాతో రాజ్ తరుణ్ నిత్యం వార్తల్లోనూ అప్పుడప్పుడూ పోలీస్ స్టేషన్ లోనూ ఉంటున్నాడు. అలాంటి నటుడు బిగ్ బాస్ లోకి వస్తే షో కు మైలేజ్ పెరుగుతుంది. అతనికీ కాస్త రిలీఫ్ గా ఉంటుంది.
సీరియల్ యాక్ట్రెస్ గా కూల్ గా ఉంటూ.. గేమ్ షోస్ లో రచ్చ రచ్చ చేస్తూ షో స్టీలర్ లా కనిపించే దీపిక కూడా బిగ్ బాస్ కు ప్లస్ అవుతుందని చెప్పాలి. తన జాతకాలతో కొన్నాళ్లుగా ఫూల్ అవుతూ.. చెప్పిన ఏదీ నిజం కాక ఆస్ట్రాలజర్ గా ఫేమ్ కోల్పోతున్న వేణు స్వామికి ఇదో మంచి అవకాశం. అదే టైమ్ లో అతని వృత్తికి కూడా కొంత మైనస్ అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. హౌస్ లో జాతకాలతో కంటే గేమ్స్ తోనే సర్వైవ్ అవుతారు. సో.. తను ఎప్పుడు ఎలిమినేట్ అవుతాడు అనేది గ్రహాలపై కాక అతని గేమ్ తీరుపై ఉంటుంది. సద్దాం, యాదమ్మ రాజులు పంచ్ లతో సందడి చేయొచ్చు. లాస్ట్ సీజన్ లో టేస్టీ తేజ అనే యూ ట్యూబర్ గోడ మీద పిల్లిలా కొన్నాళ్లు బాగా సర్వైవ్ అయ్యాడు. ఆ ప్లేస్ లో ఇప్పుడు మరో యూ ట్యూబర్ బంచిక్ బబ్లూ కనిపిస్తున్నాడు. తేజ లాగే ఇతనూ ఎంటర్టైన్ చేయగలగిన సత్తా ఉన్నవాడు. ఇక పొలిటికల్ ఇంటర్వ్యూస్ తో నెల్లూరు చేపల పులుసులోని మసాలా కంటే ఘాటుగా కనిపిస్తోన్న కిరాక్ ఆర్పీ టీఆర్పీ పెంచే సత్తా ఉందా లేదా అనేది తెలుస్తుంది. అయితే హౌస్ లో ఆటలు వేరే ఉంటాయి కాబట్టి.. బయట ఇంటర్వ్యూస్ అంత ఈజీ అయితే కాదేమో. వీళ్లు కాక మిగతా అంతా హౌస్ లో నంబరింగ్ గా కనిపిస్తున్నారు. అఫ్ కోర్స్ కొన్నిసార్లు అంచనాలు లేకుండా దిగిన వాళ్లే అదరగొడతారు. అలా సన, ఇంద్రనీల్, శ్వేతా నాయుడుతో పాటు సెలబ్రటీస్ ఇంటర్వ్యూస్ తో ఫేమ్ అయిన నిఖిల్ కూ ఛాన్స్ ఉంది. పైగా నిఖిల్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. దానికి ఈ బిగ్ బాస్ పెద్ద ప్లస్ అవుతుందని చెప్పాలి. అలీ తమ్ముడు ఖయ్యూం కూడా ఉన్నాడు. అతను ఏ మరకు ఎంటర్టైన్ చేస్తాడనేదీ చూడాలి.
అయితే ఈ మొత్తం లిస్ట్ లో లాస్ట్ సీజన్ కు పెద్దన్న లా కనిపించిన శివాజీ లాంటి ఓ సాలిడ్ పర్సన్ లేని లోటు కనిపిస్తోంది. మరి అలాంటి ప్లేస్ లో ఎవరైనా సర్ ప్రైజింగ్ సెలబ్రిటీ ఉన్నాడేమో కానీ.. మాగ్జిమం యంగ్ స్టర్స్ తో కనిపిస్తోన్న ఈ లిస్ట్ చూస్తుంటే ఈ సారి కూడా బిగ్ బాస్ నుంచి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపిస్తోంది. తేడా వస్తే సుర్రు సుమ్ము చేయడానికి కింగ్ నాగ్ ఎలాగూ ఉన్నాడు కదా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com