సినిమా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అభిజీత్.. ఆ ముగ్గురికి ఛాలెంజ్!

ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగిన బిగ్ బాస్ సీజన్ 4 గత ఆదివారంతో ముగిసింది. ఈ సీజన్ లో అభిజీత్ విన్నర్ కాగా, అఖిల్ రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అభిజీత్.. ఆ ముగ్గురికి ఛాలెంజ్!
X

ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగిన బిగ్ బాస్ సీజన్ 4 గత ఆదివారంతో ముగిసింది. ఈ సీజన్ లో అభిజీత్ విన్నర్ కాగా, అఖిల్ రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 4 లో విన్నర్ గా నిలిచిన తర్వాత ప్రస్తుతం పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా బిజీగా ఉంటున్నాడు అభిజీత్.. అంతేకాకుండా అతనికి సినిమాలలో కూడా భారీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇదిలావుండగా ఈ రోజు (డిసెంబర్ 22 మంగళవారం) గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాడు అభిజీత్.

ఈ సందర్భంగా అభిజీత్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ విన్నర్ అయ్యాక ఏదైనా మంచి కార్యక్రమాన్ని చేయాలనీ, అనుకున్నానని అందులో భాగంగానే రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపాడు. పెరిగిపోతున్న కాలుష్యం దృష్ట్యా మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నాడు. దీనిని ముందుకు తీసుకువెళ్తున్న ఎంపీ సంతోష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా అభిజీత్ వెల్లడించాడు.

మొక్కలు నాటిన అనంతరం బిగ్ బాస్ లో తన తోటి సభ్యులు అయిన సోహెల్, హారిక , కళ్యాణిలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరారు అభిజిత్.

Next Story

RELATED STORIES