71st National Awards : నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటిన తెలుగు సినిమా

71st National Awards :  నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటిన తెలుగు సినిమా
X

2023కు సంబంధించి 71వ జాతీయ పురస్కారాలు ప్రకటించింది కేంద్రం. ఈ అవార్డ్స్ లో తెలుగు సినిమా మరోసారి సత్తా చాటింది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. గర్డ్ చైల్డ్ ను చిన్న చూపు చూడకుండా వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే.. అద్భుతాలు సాధిస్తారు అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం తమిళ్ లో విజయ్ హీరోగా రీమేక్ అవుతుండటం విశేషం.

ఇక బేబీ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో దర్శకుడు సాయి రాజేష్, బెస్ట్ మేల్ సింగర్ విభాగంలో రోహిత్ కు అవార్డ్స్ వచ్చాయి. బలగం చిత్రంలో ఊరూ పల్లెటూరు పాటకు బెస్ట్ లిరిసిస్ట్ గా కాసర్ల శ్యామ్ కు నేషనల్ అవార్డ్ దక్కనుంది. దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డ్ వచ్చింది. సుకృతికి ఈ అవార్డ్ గాంధీ తాత చెట్టు సినిమాకు లభించింది. తెలుగు సినిమా కాకపోయినా తెలుగు వాడు రూపొందించిన యానమిల్ చిత్రానికి బెస్ట్ సౌండ్ డిజైన్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో అవార్డులు వచ్చాయి.

నేషనల్ లెవల్ లో చూసుకుంటే జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో 12త్ ఫెయిల్ చిత్రానికి విక్రాంత్, జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్ లకు కలిపి అవార్డ్ వచ్చింది. ఉత్తమ నటిగా మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి రాణి ముఖర్జీ ఎంపికైంది.

మొత్తంగా కొన్నాళ్లుగా తెలుగు సినిమా జాతీయ అవార్డుల్లో సత్తా చాటుతోంది. ఈ సారి కూడా మన సినిమా దమ్ము చూపించింది అనే చెప్పాలి.

Tags

Next Story