సినిమా

Hamsa Nandini : బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 'అత్తారింటికి దారేది' ఫేం..

Hamsa Nandini : క్యాన్సర్ ట్రీట్‌మెంట్ బాధాకరమైనా భరిస్తున్నానని చెప్పుకొచ్చింది.

Hamsa Nandini : బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న అత్తారింటికి దారేది ఫేం..
X

Hamsa Nandini: ప్రభాస్ మిర్చి, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసిన హంసానందిని గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలియజేశారు. బ్రెప్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తనకి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు కీమో జరిగిందని తెలిపింది. ఇంకా 7 సార్లు కీమో, రేడియేషన్ చేయించుకోవాలని తెలిపింది.

సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ కఠినమైన సమయాన్ని ఎదుర్కోవడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని తెలిపింది. బ్రతుకు మీద ఆశని ఏమాత్రం కోల్పోలేదని, క్యాన్సర్ ట్రీట్‌మెంట్ బాధాకరమైనా భరిస్తున్నానని చెప్పుకొచ్చింది. తన తల్లి 18 ఏళ్ల క్రితం క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిందని తెలియజేసింది.అప్పటినుంచి భయపడుతూనే ఉన్నానని చివరికి ఆ వ్యాధి తనని కూడా కబళించిందని ఆర్ధ్రత నిండిన హదయంతో చెప్పింది. బ్రెస్ట్‌లో చిన్న కణితి రావడాన్ని గమనించి డాక్టర్‌ దగ్గరకు వెళ్లగా క్యాన్సర్ అని తేలిందని చెప్పారు. అప్పటికే క్యాన్సర్ థర్డ్ స్టేజ్‌లో ఉందని చెప్పి ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు.

ఈ భయంకరమైన వ్యాధిని ఎదుర్కొనేందుకు నన్ను నేను స్ట్రాంగ్‌గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ మీముందుకు వస్తా అని ఆశాభావం వ్యక్తం చేసింది. నా జీవితం కొందరికైనా ప్రేరణ కావాలని భావిస్తున్నా అని హంసానందిని తెలిపారు.

Next Story

RELATED STORIES