Shivani Nagaram : హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన తెలుగు హీరోయిన్

తెలుగు హీరోయిన్లకు ఆఫర్స్ రావడమే గగనం అయింది. ఒకప్పుడు అయితే ఒక్క హిట్ పడ్డ తర్వాత కూడా మరో ఆఫర్ లేని పరిస్థితి. దీంతో వాళ్లంతా తమిళ్ ఇండస్ట్రీలోకి వెళుతున్నారు. అక్కడ ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగు వాళ్లకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కాకపోతే హిట్స్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. అలాంటి టైమ్ లో ఏకంగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టడం అంటే మాత్రం చిన్న విషయం కాదు. పేరుకు చిన్న సినిమాలే కానీ వాటి ఇంపాక్ట్ మాత్రం పెద్దదే. ఆ హీరోయిన్ శివానీ నాగారం. కూచిపూడి డ్యాన్సర్, సింగర్ కూడా అయిన తనకు ఫస్ట్ మూవీ ఛాన్స్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో వచ్చింది.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో ఓవర్ నైట్ ఫేమ్ వచ్చింది. అందులో తన నటనకు చాలామంది ఫిదా అయిపోయారు. ఈ మూవీ కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినా తను బాగా ఆకట్టుకుంది. అయినా అందరిలాగా మరో తెలుగు ఆఫర్ వస్తుందా లేదా అని డౌట్ పడ్డారు. ఆ డౌట్ లో నిజం లేదు అని నెక్ట్స్ మూవీతో పెద్ద హిట్ అందుకుంది. ఆ మూవీ లిటిల్ హార్ట్స్. లిటిల్ హార్ట్స్ ఎవరూ ఊహించని విధంగా పెద్ద హిట్ అయింది. ఈ మూవీలో కూడా తన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ గా హీరో కంటే పెద్దది అమ్మాయిగా కనిపిస్తుంది. మంచి కామెడీ, జెన్ జీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ కావడంతో కమర్షియల్ గా ఈ మూవీ సూపర్ హిట్ అయింది.
శివానీ రేంజ్ మారింది. తర్వాత అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరో సుహాస్ తోనే తాజాగా హే బలవంత్ అనే మూవీలో నటించింది. ఇది కూడా విజయవంతమైన మూవీగా నిలిచింది. ఈ మూవీ కంటెంట్ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ప్రమోషన్స్ పరంగా మెప్పించింది. దీంతో ఈ మూవీ విజయం సాధించింది. కంటెంట్ బలంగా ఉండటమే ప్లస్ అవడమే విజయానికి కారణం. మొత్తంగా ఈ మూడు సినిమాలు విజయం సాధించడంతో శివానీ రేంజ్ పెరిగింది. తనిప్పుడు ఇండస్ట్రీలో మంచి ప్లేస్ లో నిలుస్తుంది. వరుసగా ఆఫర్స్ వస్తున్నా.. తన స్టోరీ సెలెక్షనే ఈ హ్యాట్రిక్ విజయాలకు కారణం. మరి ఫ్యూచర్ లో ఇంకెన్ని హిట్స్ అందుకుంటుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
