aaradugula bullet twitter review: ఆలస్యమైనా 'ఆరడుగుల బుల్లెట్' బాగానే.. : ట్విట్టర్ రివ్యూ

aaradugula bullet twitter review: సిటీమార్ సక్సెస్‌ని అందుకున్న గోపీచంద్.. అనివార్య కారణాల వల్ల పక్కన పెట్టిన ఆరడుగుల బుల్లెట్ చూసిన ప్రేక్షకులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. 2012లో బూపతి పాండియన్ దర్శత్వంలో ఈ సినిమా మొదలైంది.
కథాంశంపై విబేధాల కారణంగా అతడు తప్పుకోగా డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. అటు ఇటు మారి ఆరడుగుల బుల్లెట్ ఎప్పుడో జూన్ 9, 2017న రిలీజ్ చేసేందుకు సిద్దమైంది చిత్ర యూనిట్. మళ్లీ టైమ్ బాలేదు.. ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దాంతో నిర్మాతలు చిత్ర విడుదలను వాయిదా వేశారు.
2020లో రిలీజ్ చేద్దామని మరో ముహూర్తం పెట్టారు యూనిట్ సభ్యులు.. అప్పుడూ వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను తొలగించుకుని ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది ఈ చిత్రం. నయనతార, గోపీచంద్ ప్రధాన పాత్రలుగా తెరెకిక్కిన ఆరడుగుల బుల్లెట్ హీరో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయని ట్విట్టర్ వేదికగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నయన్, గోపీచంద్‌ల కెమిస్ట్రీ తెరపైన అద్భుతంగా ఉందని అంటున్నారు. మరికొన్ని పాత్రల్లో ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, చలపతి రావు, మధునందన్, సలీం బేగ్, ఉత్తేజ్, రమాప్రభ, సురేఖ వాణి ప్రధాన తారాగాణంగా ఉన్నారు.
ఈ చిత్రంలోని పాటలను శ్రీమణి రాయగా మణిశర్మ స్వరాలు సమకూర్చారు. కొలంబస్, సనసన్నగా, బూస్ట్ పిల్ల, చిన్నప్పుడు పాటలు ఇప్పటికే విడుదలై సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com