Bapu Movie : తేలిపోయిన తెలుగు సినిమాలు

ఈ వారం మూడు తెలుగు, రెండు సినిమాలు తమిళ్ విడుదలయ్యాయి.తమిళ్ మూవీ రెండూ ఆకట్టుకున్నాయి. మంచి రివ్యూస్ తెచ్చుకున్నాయి. కానీ తెలుగు సినిమాలు మాత్రం తేలిపోయాయి అనే చెప్పాలి. తెలుగు నుంచి బాపు, రామం రాఘవం రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాల్లోనూ తండ్రి, డబ్బు అనే పాయింట్స్ కామన్ గా ఉన్నాయి. కాకపోతే నేపథ్యాలు వేరు.క్యారెక్టరైజేషన్స్ వేరు.బట్ రిజల్ట్ మాత్రం సేమ్.
జబర్దస్త్ నుంచి ఫేమ్ అయిన ధనరాజ్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా రామం రాఘవం. సముద్రఖని అతని తండ్రి పాత్రలో కనిపించాడు. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణను ఆడియన్స్ కు హత్తకునేలా రూపొందించడంలో ధనరాజ్ దర్శకుడుగానూ, నటుడుగానూ ఫెయిల్ అయ్యాడు అనే కామెంట్స్ వచ్చాయి. తనలోని దర్శకుడిని చూపించడంలో కొంత వరకు సక్సెస్ అయినా.. ఈ సినిమాకు కీలకమైన ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడంలో తేలిపోయాడు అంటున్నారు. ఈ కారణంగానే రామం రాఘవం బాక్సాఫీస్ వద్ద గెలవడం కష్టమే అంటున్నారు.
ఇక దయా డైరెక్షన్ లో తెలంగాణలోని ఓ బక్కరైతు కథతో వచ్చిన సినిమా బాపు. బ్రహ్మాజీ, సుధాకర్ రెడ్డి, ఆమని కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ కూడా ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో విఫలమైందనే అంటున్నారు. ప్రధాన పాత్రల్లో సుధాకర్ రెడ్డి(బలగం తాత పాత్రధారి) తప్ప మిగతా అంతా ఆయా పాత్రలను ప్రెజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. బ్రహ్మాజీ ఒకే ఎక్స్ ప్రెషన్ తో చిరాకు పెట్టించాడు. ఆమని రాంగ్ ఛాయిస్ అన్నారు. వ్యవసాయంలో అప్పుల పాలైన ఒక వ్యక్తి రైతు బీమా కోసం చనిపోదాం అనుకుంటాడు. అతని తండ్రి తనే చనిపోతా అంటాడు. ఆ క్రమంలో ఏం జరిగింది అనే కోణంలో ఈ సింగిల్ పాయింట్ చుట్టూనే అల్లుకున్న ఈ కథలోని ఎమోషన్ నవ్వుల పాలైందనే రివ్యూస్ వచ్చాయి. మొత్తంగా ఈ రెండు సినిమాలకూ మంచి ప్రమోషన్స్ కూడా చేశారు. బట్ కంటెంట్ మైనస్ వల్ల కలెక్షన్స్ కూడా కష్టమే అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com