OTT Movies : ఈ వారం ఓటిటిలోకి వస్తోన్న మూవీస్ ఇవే

OTT Movies :  ఈ వారం ఓటిటిలోకి వస్తోన్న మూవీస్ ఇవే
X

వెండితెరపై హిట్ అయినా కాకున్నా కొన్ని సినిమాలు ఓటిటిల్లో అదరగొడతాయి. అందుకే చాలా సినిమాలకు ఓటిటి ఆడియన్స్ సెపరేట్ గా ఉన్నారు. థియేటర్స్ లో చూసిన వాళ్లూ, చూడని వాళ్లు కూడా ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇక ఈ వారం(మే 5 నుంచి 11 వరకు) నాలుగు తెలుగు సినిమాలు ఓటిటిల్లో సందడి చేయబోతున్నాయి. వీటిలో మూడు తెలుగు, ఒకటి తమిళ్ డబ్బింగ్ మూవీ ఉన్నాయి.

1. జాక్

సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం జాక్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలైంది. బట్ మొదటి ఆటకే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా గురించి సిద్ధు చాలానే చెప్పాడు. డిజే టిల్లు రెండు భాగాలూ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా కాబట్టి ట్రేడ్ లోనూ అంచనాలున్నాయి. బట్ వాటిని అందుకోవడంలో జాక్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇక ఈ చిత్రం ఈ నెల 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది.

2. రాబిన్ హుడ

జాక్ తో పాటు ఏప్రిల్ 10న విడుదలైంది రాబిన్ హుడ్. భీష్మ తర్వాత ఆ దర్శకుడు వెంకీ కుడుములతో నితిన్ చేసిన ఈ మూవీ కూడా మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కొన్నాళ్లుగా సరైన కమ్ బ్యాక్ కోసం చూస్తోన్న నితిన్ రాబిన్ హుడ్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. బట్ వర్కవుట్ కాలేదు. అటు శ్రీలీల కూడా ఫామ్ లోకి వచ్చే ప్రయత్నంలో మరోసారి ఫెయిల్ అయింది. ఇక ఈ రాబిన్ హుడ్ ఈ నెల 10 నుంచి జీ 5 లో స్ట్రీమ్ కాబోతోంది.

3. గుడ్ బ్యాడ్ అగ్లీ

అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి తెలుగులో పెద్దగా టాక్ రాలేదు. విపరీతమైన తమిళ్ మూవీస్ రిఫరెన్స్ లు ఉండటం కూడా కొంత మైనస్ అయింది. ఈ గ్యాంగ్ స్టర్ కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు అనే చెప్పాలి. ఏప్రిల్ 10న విడుదలైన ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ నెల 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. తమిళ్ లో థియేటర్స్ లో మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఓటిటిలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

4. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

యాంకర్ నుంచి హీరో అయిన ప్రదీప్ మాచిరాజు, తన రూట్ లోనే హీరోయిన్ అయిన దీపిక పిల్లి జంటగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఏప్రిల్ 11న విడుదలైన ఈ మూవీని నితిన్ - భరత్ ద్వయం రూపొందించింది. టైటిల్ వల్ల సినిమాకు క్రేజ్ వచ్చింది. కానీ సినిమా విజయం సాధించలేదు. ప్రదీప్ టైమింగ్ బుల్లితెరపైనే బావుంది అనే కమెంట్స్ వచ్చాయి. ఇక ఈ చిత్రం ఈ నెల 8 నుంచి ఈటీవి విన్ లో స్ట్రీమ్ కాబోతోంది.

Tags

Next Story