Acharya : 'ఆచార్య' సినిమాలో చిరు పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Acharya :  ఆచార్య సినిమాలో చిరు పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
Acharya : కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి..

Acharya : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య.. రామ్ చరణ్ కీరోల్ ప్లే చేశాడు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి.. భారీ అంచనాల మధ్య గత నెలలో రీలిజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ప్లాప్ అయింది.

అయితే ఈ సినిమాలో ఓ కీలకమైన సన్నివేశంలో నటించి మెప్పించింది సింగర్ ఎంఎల్ శృతి.. చిరంజీవి పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తన ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో వెల్లడించింది. చిన్నప్పటి నుండి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని, అలాంటిది ఇప్పుడు ఆయన పక్కనే నటించే ఛాన్స్ రావడం, ఆయనతో కొద్దిసేపు మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.

ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కొరటాల శివకి ధన్యవాదాలు తెలిపింది. టాలీవుడ్‌‌లో సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది శృతి.. గతేడాది బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమాలో 'అడిగా అడిగా' అంటూ సాగే ఈ ఫీల్‌గుడ్‌ మెలోడిని పాడింది. కాగా శృతి నటుడు జయంత్ ని వివాహం చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story