KP Chowdary : ఆత్మహత్య చేసుకున్న తెలుగు నిర్మాత

ఓ తెలుగు సినిమా నిర్మాత గోవాలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. అయితే అతను రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు. తను డ్రగ్స్ దందా చేసి అలా వచ్చిన డబ్బుతో నిర్మాతగా మారాలని ఆశించి, భంగపడి పోలీస్ లకు దొరికి జైలుకు వెళ్లిన డిఫరెంట్ ప్రొడ్యూసర్. నిజానికి అతను తెలుగులో సినిమాలు నిర్మాణం చేయలేదు. తమిళ్ లో రూపొందిన రజినీకాంత్ కబాలిని తెలుగులో ప్రొడ్యూస్ చేశాడు. తమిళ్ లోనే కణిదన్ అనే చిత్రాన్ని నిర్మించాడు. అలాగే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్, వెంకటేష్ ల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు.
కేపీ చౌదరిది ఖమ్మం జిల్లా. మెకానికల్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యూయేట్ అయిన అతను పూణేలోని ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీస్ సంస్థలో డైరెక్టర్ గా చాలా పెద్ద హోదాలో పనిచేశాడు. ఆ క్రమంలోనే తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలో చాలా తక్కువ టైమ్ లోనే ఎక్కువ పరిచయాలు పెంచుకున్నాడు. వారికి గంజాయి, హెరాయిన్, కొకైన్ ను సప్లై చేస్తూ తను కూడా సేవించేవాడని గతంలో పోలీస్ విచారణలో తేలింది. ఇతర దేశాల నుంచి డ్రగ్స్ ను తెప్పించి సరఫరా చేయడంలో ఎక్స్ పర్ట్ అంటారు. 2023లో వంద ప్యాకెట్ల కొకెయిన్ తో హైదరాబాద్ వస్తుండగా పోలీస్ లకు పట్టుపడ్డాడు.
అయితే కొన్నాళ్లుగా విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడట కేపీ చౌదరి. ఈ క్రమంలోనే గోవాలో ఆత్మహత్య చేసుకున్నాడు. తాము అతని కోసం వెళ్లే సరికే మరణించి ఉన్నాడని తెలిపారు పోలీస్ లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com