రెండు భాగాలు ట్రెండా .. లేక నిర్మాతల బెండు తీస్తున్నారా..?

రెండు భాగాలు ట్రెండా .. లేక నిర్మాతల బెండు తీస్తున్నారా..?
రెండు ఒకట్లు ఎన్ని అంటే రెండు అంటాం. కానీ సినిమా వాళ్లు మాత్రం ఇప్పుడు రెండు ఒకట్లు ఒకటే అంటున్నారు.

రెండు ఒకట్లు ఎన్ని అంటే రెండు అంటాం. కానీ సినిమా వాళ్లు మాత్రం ఇప్పుడు రెండు ఒకట్లు ఒకటే అంటున్నారు. అదెలా అంటారా.. అదంతే కొత్త ట్రెండ్ అని కూడా చెబుతున్నారు. మరి నిజంగా అవసరమై అంటున్నారా లేక ట్రెండ్ కోసం సెట్ చేస్తున్నారో తెలియదు కానీ.. చాలామంది ఇప్పుడు రెండు ఒకట్లు ఒకటే అంటున్నారు. ఇందుకు ఆద్యుడు రాజమౌళి అయితే.. దాన్ని కంటిన్యూ చేయడం మా బాధ్యత అంటున్నారు ఈ తరం దర్శకులు.

బాహుబలి మొదలైనప్పుడు ఒకే సినిమా అనుకున్నారు. కానీ కొన్ని రోజులకే రెండో పార్ట్ కూడా ఉంటుందని చెప్పారు. చెప్పినట్టుగానే రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రభాస్‌ను ప్యాన్ ఇండియన్ స్టార్ ను చేస్తే.. రాజమౌళిని ఇండియాస్ టాప్ డైరెక్టర్ గా మార్చింది. అయితే రెండో భాగంపై ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ పెంచేలా చేసింది మాత్రం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ మార్క్.. కామన్ మేన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకూ ఈ విషయం తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ తోనే రెండో భాగానికి దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయి.

ఆ తర్వాత వచ్చిన కెజీఎఫ్ కూడా ఫస్ట్ పార్ట్ తర్వాత రెండో భాగం కూడా రాబోతోంది. కోలార్ మైన్స్ లోకి ఎంటర్ అయిన రాకీ అక్కడ చాలా పెద్ద తలలుగా భావించిన అందరినీ చంపేస్తాడు. కానీ సోదరుడి కోసం ఆ మైన్స్ ను దానిపై ఆధిపత్యాన్ని వదులుకున్న అథీరా మళ్లీ వస్తాడు అనే పాయింట్ తో ఫస్ట్ చాప్టర్ ఎండ్ అయింది. మరి అతన్ని కూడా రాకీ ఎలా అంతం చేస్తాడు అనే ఇంట్రెస్ట్ ఈ సినిమాపై ఉంచింది. పైగా మేకింగ్ పరంగా సరికొత్త థీమ్ తో కనిపిస్తుందీ చిత్రం. అందుకే కెజీఎఫ్ చాప్టర్ 2 కూడా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవచ్చు.

రెండు రెండ్లు ఒకటి అంటే ఒక సినిమా సినిమా ఒకటే.. కానీ భాగాలు రెండు అన్నమాట. కథ మారదు. పాత్రధారులూ మారరు. కానీ సినిమా మాత్రం రెండు భాగాలవుతుందన్నమాట. అలా వచ్చిన బాహుబలి, కెజీఎఫ్ దేశాన్ని ఊపేయడంతో ఇప్పుడిదో ట్రెండ్ గా మొదలు కాబోతోంది. ఇప్పటికే సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న చిత్రాన్ని రెండు భాగాలుగా చేశారు. పుష్ప సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్ లో ఇచ్చే ఫినిషింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని అప్పుడే ఊదరగొడుతున్నారు కూడా.

ఇక ఇదే ట్రెండ్ లోకి ప్రభాస్ కూడా వస్తున్నాడు అనే వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. కెజీఎఫ్ తోనే ఫేమ్ అయిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనే ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న సలార్ చిత్రాన్ని కూడా రెండు భాగాలు చేస్తున్నారనే రూమర్స్ ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి. మరి అందులో నిజమెంత అనేది చెప్పలేం కానీ.. మొత్తంగా ఈ రెండు భాగాల ట్రెండ్ మాత్రం మెల్లగా ఊపందుకుంటోంది. రెండు భాగాలుంటే ఇబ్బంది లేదు కానీ.. అందరికీ ఆ స్థాయిలో కథ కుదరాలి. అది చూసుకోకుండా కేవలం ట్రెండ్ కోసం వెళితే బడ్జెట్ లాస్ తప్ప మరే ఉపయోగం ఉండదు.

Tags

Read MoreRead Less
Next Story