నవ్య స్వామి అభిమానులకు గుడ్ న్యూస్.. ఎంట్రీ పక్కా..?

Navya swamy: నా పేరు మీనాక్షి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది నవ్య స్వామి. అయితే నవ్య స్వామికి అదిరిపోయే అఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ లో నవ్య స్వామికి అవకాశం వచ్చినట్లు సమాచారం. బిగ్ బాస్(bigg boss) నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, త్వరలోనే ఐదోది కూడా మొదలవబోతుంది. తెలుగులోకి బిగ్ బాస్ షో మొదలైన సమయంలో దీన్ని ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఊహించని విధంగా ఈ షోను ప్రేక్షకులే సూపర్ హిట్ చేశారు.
Navya Swamy Photos Source: Instagram
నవ్య స్వామి కన్నడ, తమిళ సీరియల్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. డాక్టర్ కావాలని యాక్టర్ అయ్యానని చాలా సార్లు చెప్పుకొచ్చింది. ఏదో అవకాశం వస్తే కన్నడ సీరియల్ ఆడిషన్స్‌కు వెళ్లి సెలెక్టయింది నవ్య. ఆమె నటించిన 'తంగళి' సీరియల్ ప్రేక్షాదరణ పొందింది. ఆ తర్వాత 'వాణీ రాణీ', ఆహ్వానం వంటి సీరియల్స్ లో చేసింది. ప్రస్తుతం నవ్య 'ఆమెకథ' సీరియల్‌లో నటిస్తుంది. ఈ నటీ తన అందంతో ఎంతో మంది హృదయాలను దోచుకుంది. ఓ సీరియల్ నటుడితో ప్రేమలో పడినట్లు టాక్ వచ్చింది. కానీ ఇదంతా ఏమిలేదని, తామిద్దరం మంచి ఫ్రేండ్స్ అని తేల్చిచెప్పారు.
బిగ్ బాస్ హౌస్ లోకి ఈ సారి బాగా పాపులర్ అయిన స్టార్స్ ని తీసుకురావాలని చూస్తున్నరంట. అందులో భాగంగా బుల్లితెర టీవీ నటి నవ్యస్వామిని సంప్రదించారంట. ఈ సీజన్'లో పాల్గొనేందుకు నవ్యస్వామి షో నిర్వాహకులు భారీగా ఆఫర్ ఇచ్చారంట. దీంతో ఆమె అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
నవ్య స్వామి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అంతేకాడు ఎప్పటికప్పుుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టా లో ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలలో రెడ్ కలర్ లాంగ్ డ్రెస్ లో బాగా ఆకట్టుకుంది. నవ్య ఫోటోలు చూసిన అభిమానులు లైక్ లు కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు
Navya Swamy Photos Source: Instagram
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com