అనూహ్యంగా సీరియల్స్ నుంచి తప్పుకున్న స్టార్స్ లిస్ట్..!

అనూహ్యంగా  సీరియల్స్  నుంచి  తప్పుకున్న స్టార్స్ లిస్ట్..!
Tv Serial Actress: బుల్లితెరపై వచ్చే సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను వీపరీతంగా అలరిస్తుంటాయి.

బుల్లితెరపై వచ్చే సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను వీపరీతంగా అలరిస్తుంటాయి. సీరియల్స్‎లో వచ్చే పాత్రలు ఆడియన్స్ ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. సీరియల్స్‎లో నటిస్తున్న నటీనటులపై ప్రేక్షకులు అభిమానం కూడా పెంచుకుంటారు. కొంతమంది అనూహ్యంగా సీరియల్స్ నుంచి తప్పుకుంటున్నారు. ఈ ఏడాది తప్పుకున్న వాళ్ల గురించి ప్రస్తావిస్తే, బుల్లితెరపై వచ్చే అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్ లో హీరోయిన్ గా డ్యూయెల్ రోల్ చేసిన చైత్రా రాయ్ సడన్ గా తప్పుకుంది. నాపేరు మీనాక్షి సీరియల్ లో నటిస్తున్న మధురెడ్డి సడన్ తప్పుకున్నారు.

ఇక కల్యాణ వైభోగమే సీరియల్‎లో హీరోగా జై పాత్రలో విజె సన్నీ నటించారు. నాపేరు మీనాక్షి సీరియల్ నుంచి వీణ పొన్నప్ప కూడా రావడంలేదు. హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ నటించిన కీర్తి తల్లి కాబోతున్న కారణంగా సీరియల్ నుంచి వైదొలిగింది. కేరాఫ్ అనసూయ సీరియల్ లో హీరోగా నటించిన ప్రజ్వల రవి తప్పుకున్నాడు. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సావిత్రమ్మ గారబ్బాయి సీరియల్ లో చందన్ కుమార్ హీరోగా నటించాడు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసికి సపోర్ట్ చేసే అంకిత పాత్రలో శిరీషా నటించింది. అయితే కరోనా మహమ్మారి భయంతో సీరియల్ నుంచి తప్పుకుంది. మనసు మమత సీరియల్ లో గీత పాత్రలో నటించిన ప్రియాంక అమ్ము కూడా అర్థాంతరంగా సిరీయల్స్ నుంచి తప్పుకుంది.

Tags

Read MoreRead Less
Next Story