Sidhu Jonnalagadda : తెలుసు కదా.. షూటింగ్ మొదలైంది

డిజే టిల్లు మూవీస్ తో స్టార్ బాయ్ గా అవతరించాడు సిద్ధు జొన్నలగడ్డ. అతన్ని ఒరిజినల్ పేరుతో కంటే టిల్లుగానే ఎక్కువగా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం క్రేజీ హీరోగా మారాడు. మినిమం గ్యారెంటీ హీరోల లిస్ట్ లోనూ జాయిన్ అయ్యాడు సిద్దు. అతను హీరోగా కాస్ట్యూమర్ నీరజ కోన రూపొందిస్తోన్న సినిమా ' తెలుసు కదా'. నీరజ ఈ మూవీతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ మూవీలో రాశిఖన్నా.. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించబోతున్నారు.
ఈ మూవీ అనౌన్స్ మెంట్ నుంచి ఆకట్టుకుంటూనే ఉంది. డిఫరెంట్ కాంబినేషన్ గానూ చెప్పుకుంటున్నారు. ఇక తెలుసు కదా మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరుపుతారట. నెల తర్వాత అవుట్ పుట్ ను చూసుకుని అంతా ఓకే అనుకుంటే అప్పుడు నెక్ట్స్ షెడ్యూల్ కు వెళతారు. లేదంటే ఈ నెల రోజుల అవుట్ పుట్ కు సంబంధించి ప్యాచ్ వర్క్స్ నే ముందు కంప్లీట్ చేసుకుంటారట. అఫ్ కోర్స్ నెలలోనే మాగ్జిమం షూటింగ్ అయిపోతుందని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే సిద్ధు ప్లానింగ్ అలా ఉంటుంది. మొత్తంగా డిజే టిల్లు లాంటి ఫంకీ మూవీ తర్వాత సిద్ధు చేస్తోన్న సినిమా కాబట్టి ఖచ్చితంగా అంచనాలుంటాయి. వాటిని రీచ్ అయ్యే విధంగానే టీమ్ ప్లానింగ్ కూడా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదేమో కదా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com