Thala Ajith Kumar : రైఫిల్ షూటింగ్‌లో 4 బంగారు, 2 కాంస్య పతకాలు సాధించిన తల అజిత్ కుమార్..

Thala Ajith Kumar : తల అజిత్ కుమార్ సినీ స్టార్ మాత్రమే కాదు మంచి క్రీడాకారుడు కూడా. ఆయనకు బైక్ రేసింగ్, షూటింగ్ అంటే ఎంత ఇష్టమో అజిత్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాలిమై షూటింగ్ సమయంలో ఆయన ఒక్కరే బైక్ పై కొన్ని వందల కిలోమీటర్లు రేసింగ్ చేశారు. తాజాగా అజిత్.. తమిళనాడు రాష్ట్రస్థాయి 47వ రైఫిల్ షూటింగ్‌లో 4 బంగారు పతకాలను, 2 కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
తిరుచ్చిలో జరిగిన ఈ రైఫిల్ షూటింగ్ పోటీలకు 1300ల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ నెల 27న ఈ పోటీ జరిగింది. సెంటర్ ఫైర్ పిస్టల్, స్తందర్డ్ పిస్టల్ వస్టర్, 50 మీటర్ల ప్రీపిస్టల్ మాస్టర్, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ కేటగిరీల్లో 4 బంగారు పతకాలను గెలుపొందారు. 50 మీటర్ల ప్రీ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ కేటగిరీలో 2 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. అజిత్ విజయంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com