Thalapathi Vijay ఫస్ట్ మూవీ టైటిలే చివరి సినిమాకూ

Thalapathi Vijay   ఫస్ట్ మూవీ టైటిలే చివరి సినిమాకూ
X

కోలీవుడ్ నెంబర్ వన్ స్టార్ హీరో విజయ్. ఫ్యాన్స్ అంతా దళపతిగా పిలుచుకునే విజయ్ కి అక్కడ ఉన్న క్రేజ్ రజినీకాంత్ ను మించినది అని చెప్పొచ్చు. అందుకే తెలుగులోనే కాక అన్ని భాషల్లో డిజాస్టర్ అనిపించుకున్న గోట్ మూవీ తమిళనాడులో ఏకంగా 450 కోట్లు వసూళ్లు సాధిందింది. 2024లో హయ్యొస్ట్ గ్రాసర్ కూడా గోట్ చిత్రమే కావడం విశేషం. అదీ విజయ్ ఛరిష్మా. అలాంటి విజయ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆల్రెడీ పార్టీ అనౌన్స్ చేశాడు. చివరిగా హెచ్ వినోద్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి 'రేపటి తీర్పు' అనే టైటిల్ పెట్టబోతున్నారు.

అయితే ఈ చిత్రం తెలుగులో బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన భగవంత్ కేసరికి రీమేక్ అనే న్యూస్ ఉంది. కానీ అఫీషియల్ గా ఎవరూ నిర్ధారించలేదు. కాకపోతే తెలుగులో శ్రీ లీల చేసిన పాత్రను తమిళ్ లో ప్రేమలు ఫేమ్ మమిత బైజు చేస్తోందనే టాక్ మాత్రం ఉంది. కాజల్ పాత్రలో పూజాహెగ్డే నటిస్తోంది.

కొందరేమో భగవంత్ కేసరిలో చిన్న పిల్లలకు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనే సీన్ ను మాత్రమే తమిళ్ లో వాడుతున్నారు అంటున్నారు. ఏదేమైనా ఈ తమిళ్ చిత్రానికి రేపటి తీర్పు అనే టైటిల్ మాత్రం ఆకట్టుకుంటోంది. విశేషం ఏంటంటే.. విజయ్ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ టైటిల్ కూడా ఇదే. ఈ టైటిల్ తోనే అతను హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రానికి అతని తండ్రి చంద్రశేఖరే దర్శకుడు. మొత్తంగా ఫస్ట్ మూవీ టైటిల్ నే చివరి సినిమాకూ పెడుతున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేరే చెప్పక్కర్లేదు. అతని ఫ్లాప్ సినిమాలే భారీ లాభాలు తెస్తుంటే లాస్ట్ మూవీ అంటే ఇంకే రేంజ్ లో ఉంటుందో అంచనాలకూ అందదేమో..

Tags

Next Story