Thalapathi Vijay : జన నాయకుడి చివరి షాక్ ఎన్టీఆర్ కేనా

Thalapathi Vijay :  జన నాయకుడి చివరి షాక్ ఎన్టీఆర్ కేనా
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రెడీ అవుతున్నాడు. వీటి రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి కాబట్టి నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు. వీటిలో ముందుగా వచ్చేది వార్ 2. ఈ మూవీతో అతను బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు.హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఆగస్ట్ 15న విడుదల చేస్తాం అని ప్రకటించారు. ఇక మరోటి ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న డ్రాగన్. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీని 2026 జనవరి 9న విడుదల చేస్తాం అని ఓపెనింగ్ రోజునే ప్రకటించారు. బట్ ఆ డేట్ కు ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు జన నాయకుడు విజయ్.

తమిళ్ టాప్ స్టార్ దళపతి విజయ్ మూవీ అంటే అక్కడ ఏరేంజ్ లో ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. అతని ఆల్ టైమ్ డిజాస్టర్ మూవీ అయిన గోట్ ఏకంగా 450 కోట్లు వసూలు చేసింది. అదీ ప్యాన్ ఇండియా కాకుండానే. అలాంటి దళపతి సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి వస్తున్నాడు. పొలిటికల్ ఎంట్రీకి ముందు చివరగా ఇప్పుడు జన నాయగన్ అనే మూవీ చేస్తున్నాడు. హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని కూడా 2026 జనవరి 9న విడుదల చేయాలనుకుంటున్నారట. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ చివరి సినిమా కాబట్టి కొంత టైమ్ తీసుకున్నా ది బెస్ట్ అనేలా ఉండేందుకు ఆలస్యంగానే విడుదల చేయాలనుకుంటున్నారు. అందుకే జనవరి 9 అనుకుంటున్నారు. అంటే అదే డేట్ కు వస్తోన్న ఎన్టీఆర్ డ్రాగన్ కు విజయ్ మూవీ సౌత్ లో ఖచ్చితంగా పెద్ద షాక్ ఇస్తుంది.

విజయ్ కి తమిళ్ తో పాటు కేరళ, కర్ణాటకలో తిరుగులేని మార్కెట్ ఉంది. తెలుగులోనూ ఫర్వాలేదు.కేరళలో అయితే రికార్డ్ ఓపెనింగ్స్ వస్తాయి. కర్ణాటకలో బయ్యర్స్ అంతా మాగ్జిమం సేఫ్ అవుతారు. అలాంటి మార్కెట్ ఉన్న స్టార్ తో తలపడటం అంటే డ్రాగన్ కు కాస్త రిస్క్ అనే చెప్పాలి. అదే టైమ్ కు వస్తే కోలీవుడ్ లో థియేటర్స్ కూడా ఉంటాయనుకోలేం. కేరళలో ఎన్టీఆర్ మూవీకి గ్యారెంటీగా షాక్ తప్పదు. ఇక కర్ణాటకలో ఎన్టీఆర్ కూ స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి ఇక్కడ టఫ్ ఫైట్ ఇవ్వొచ్చు. ఇక మిగతా అంటే హిందీ మార్కెట్ అతని వార్ 2 రిజల్ట్ పై ఆధార పడి ఉంటుంది. సో.. జన నాయగన్ 2026 జనవరి 9నే వస్తే అదే డేట్ కు వస్తాం అని ముందే ప్రకటించిన డ్రాగన్ కు ఇబ్బందులు తప్పవు.

Tags

Next Story