Thalapathi Vijay : సినిమాతో పాలిటిక్స్ స్టార్ట్ చేసిన హీరో

సినిమాల్లో రాజకీయాలుంటాయి. సినిమా వారితో రాజకీయాలు చేస్తారు. సినిమాతో రాజకీయం మొదలుపెట్టడం కూడా చూశాం. కాకపోతే చాలా యేళ్ల తర్వాత ఈ మూడోది మరోసారి రిపీట్ అవుతోంది. అది కూడా తమిళనాడులోనే. గతంలో ఎమ్జీఆర్, కరుణానిధి వంటి వారు సినిమాలను రాజకీయాల కోసం వాడుకున్నారు. ఇటు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే ముందు చేసిన సినిమాలు కూడా దాన్నే ప్రతిబించాయి. ఇప్పుడు తమిళ్ టాప్ స్టార్ విజయ్ కూడా అదే చేస్తున్నాడు. తన లేటెస్ట్ మూవీ టైటిల్ తోనే ఆ విషయాన్ని డిక్లేర్ చేయడం విశేషం.
కొన్నాళ్ల క్రితమే విజయ్ రాజకీయ పార్టీ స్థాపించాడు. అయితే సినిమా, పాలిటిక్స్ అంటూ రెండు పడవలపై కాళ్లు వేయడం కాకుండా చివరగా ఈ సినిమా చేసి పూర్తిగా రాజకీయాలకే అంకితం అవుతా అని ప్రకటించాడు. అంటే ఇక సినిమాలు చేయను అన్నాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు హెచ్ వినోధ్ డైరెక్షన్ లో 69వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి అతని ఫస్ట్ మూవీ టైటిల్ 'రేపటి తీర్పు' అనే టైటిల్ పెడతారు అనే వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు అని అసలు టైటిల్ అనౌన్స్ చేసింద మూవీ టీమ్. ' జన నాయగన్' ఇదీ టైటిల్. అంటే అర్థమైంది కదా.. జన నాయకుడు అని. ఇలా టైటిల్ తో తనకు తానే జన నాయకుడుగా డిక్లేర్ చేయడం అంటే వెండితెర వేదికగా ఇక రాజకీయం షురూ అని చెప్పినట్టే కదా..?
ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా బాబీ డియోల్, ప్రియమణి, మమితా బైజు, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
కాకపోతే ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న స్టాలిన్ ప్రభుత్వం విజయ్ పై గుర్రుగా ఉంది. అక్కడి రాజకీయాలకు తరచుగా సినిమాలు లాస్ అవుతుంటాయి. మరి ఈ మూవీని అంత ఈజీగా రిలీజ్ కానిస్తారా అనేది కూడా డౌటే. ఏదేమైనా మూవీలోనే జన నాయకుడు అనిపించుకుంటాడా లేక జనంలో కూడా జన నాయకుడు అవుతాడా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com