Jason Sanjay : దర్శకుడిగా దళపతి విజయ్ కుమారుడు ఎంట్రీ

సినీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన, ఊహించని వార్త వైరల్ అవుతోంది. స్టార్ నటుడు తలపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాడు. జాసన్ సంజయ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తన మొదటి వెంచర్ కోసం లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి పని చేస్తుండడంతో జాసన్ సంజయ్ అందర్నీ ఆకర్షించాడు.
ప్రస్తుతానికైతే ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ గోప్యంగా ఉంచారు. జాసన్ సంజయ్ విజయ్ తన మొదటి దర్శకత్వ వెంచర్ గురించి తన ఆలోచనలను ఈ సందర్భంగా పంచుకున్నారు. "వారు నా స్క్రిప్ట్‌ను ఇష్టపడి, దాన్ని మెటీరియలైజ్ చేయడానికి నాకు పూర్తి సృజనాత్మక స్వేచ్ఛను ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. మేము ఇప్పుడు పరిశ్రమలోని వర్ధమాన తారలతో చర్చలు జరుపుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు సుభాస్కరన్ సర్‌కి కృతజ్ఞతలు, ఇది నాకు అపారమైన ఉత్సాహాన్ని, భారీ బాధ్యతను కలిపిస్తుంది. నేను దర్శకుడిగా నా కలలను విజువల్‌గా మార్చడానికి చాలా సహాయకారిగా ఉన్న మిస్టర్ తమిళ్ కుమరన్‌కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని ఆయన అన్నారు.
అనేక విజయవంతమైన చిత్రాలతో, తలపతి విజయ్ ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమలో మంచి నటుడిగా స్థిరపడ్డాడు. త్వరలో ఆయన నటనకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి రావచ్చని వార్తలు వస్తుండగా.. ఆయన తనయుడు జేసన్ సంజయ్ సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఎలా సంపాదించుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా జాసన్ విజయ్ విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్సును అభ్యసించాడు. నటనా ప్రపంచంలోకి రావాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు. జేసన్ సంజయ్ చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు, కెనడాలో ఉన్నత విద్యను కూడా పూర్తి చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com