Vijay Thalapathy : ఇళయ దళపతి మరో రికార్డ్
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తీస్తున్న మూవీ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వచ్చే నెల 5న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ రిలీజ్ కు ముందే తమిళనాట ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో దీన్ని విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తోంది. తమిళనాడులో ఉన్న ప్రతీ థియేటర్‌లోనూ దీన్ని ప్రదర్శించాలని నిర్ణయించారు. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో రిలీజ్ కానున్న ఏకైక సినిమా ‘ది గోట్’ రికార్డ్ నెలకొల్పింది. ఈ మూవీలో విజయ్ కోసం ప్రత్యేకంగా డీఏజింగ్ టెక్నాలజీని వాడి ఆయనను 25 ఏండ్ల కుర్రాడిగా చూపించనున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ కాగా.. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ తన నెక్ట్స్ మూవీని ‘ఖాకీ’ ఫేమ్ హెచ్. వినోద్ డైరెక్షన్ లో చేయనున్నాడు. దీని తర్వాత ఆయన సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘టీవీకే’ (తమిళ వెట్రి కళగం) పేరుతో ఆయన పొలిటికల్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com