Thalapathy Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ పై కేస్ పెట్టిన భార్య

తమిళ్ టాప్ హీరోగా వెలుగుతున్నాడు విజయ్. ఈ మధ్య కాలంలోనే అతను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. అంతకు ముందే తన సినిమా జీవితానికి స్వస్తి చెప్పబోతున్నాను అని చెప్పాడు. అతని లాస్ట్ మూవీ జన నాయగన్ సెన్సార్ ఇష్యూస్ లో చిక్కుకుంది. అయితే అతన్ని పొలిటికల్ గా ఫేస్ చేస్తున్న వాళ్లంతా అతనిపై కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అతను హీరోయిన్ త్రిషతో లివ్ ఇన్ రిలేషన్ నడిపిస్తున్నాడు అనే ఆరోపణలు ఇవి. అది కాక రూమర్స్ కూడా ఈ విషయం వ్యాప్తి చెందుతూనే ఉంది. రీసెంట్ గా ఓ బిజెపి పార్టీ నాయకుడు అదే విషయాన్ని ఓపెన్ గా చెప్పడం.. దానికి త్రిష సీరియస్ కావడం కూడా చూశాం. బట్ ఇది నిజమే అనిపించేలా తాజాగా అతని భార్య సంగీత సొర్ణలింగం అతనిపై కేస్ పెట్టింది.
విజయ్ ది కూడా లవ్ మ్యారేజా. సంగీత అతనికి అభిమానిగా పరిచయం అయింది. తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి పాతికేళ్లుగా జీవిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆమె ఏకంగా విజయ్ పై విడాకులు కేస్ పెట్టింది. ఈ కేస్ లో భాగంగా అతను ఓ నటితో రిలేషన్ షిప్ లో ఉండటమే ఈ విడాకులకు కారణం అని చెప్పింది. ప్రస్తుతం ఈ కేస్ కోర్ట్ లో ఉంది. దీంతో ఈ ఇద్దరూ విడాకులు తీసుకోవడం గ్యారెంటీ అనిపించేలా ఉంది. మామూలుగా విజయ్ కూడా త్రిషతో క్లోజ్ గానే మూవ్ అవుతున్నాడు అనే టాక్ బలంగా ఉంది. ఆ కారణంగానే సంగీతను అతను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతే కాక అతని భార్యతో విడిపోయి రెండేళ్లవుతోంది. రెండేళ్లుగా సంగీత .. విజయ్ కి దూరంగానే ఉంటోంది. మరి రెండేళ్ల తర్వాత ఆమె ఇప్పుడు విడాకులు తీసుకోవాలనుకునే నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది పొలిటికల్ గా ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
