Bhagavanth Kesari : బాలయ్య మూవీపై మ్యూజికల్ అప్ డేట్ ఇచ్చిన థమన్

Bhagavanth Kesari : బాలయ్య మూవీపై మ్యూజికల్ అప్ డేట్ ఇచ్చిన థమన్
'భగవంత్ కేసరి'పై క్రేజీ అప్ డేట్.. త్వరలోనే ఫస్ట్ సాంగ్ రిలీజ్

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భగవంత్ కేసరి' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఎమోషన్స్ తో కూడిన ఈ యాక్షన్ డ్రామాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 'భగవంత్ కేసరి' నుంచి సంగీత స్వరకర్త థమన్ స్వరపర్చిన మొదటి సింగిల్ త్వరలో రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం రీసెంట్ గా థమన్ సోషల్ మీడియాలో చేసిన పోస్టే. 'భగవంత్ కేసరి'ని ట్యాగ్ చేస్తూ ఓ మ్యూజిక్ సింబల్ తో కూడిన ఈ పోస్టుపై పలు సందేహాలు వ్యక్తం అవుతుండగా.. ఈ సినిమాలోని మొదట పాటను త్వరలోనే విననున్నామని నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ పాటకు సంబంధించిన ఇతర వివరాలు, విడుదల తేదీ లాంటి వాటిపైన ఆయన ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు..

'భగవంత్ కేసరి'లో కాజల్ తో పాటు హీరోయిన్ శ్రీలీల కూడా కీలక పాత్రలో నటిస్తోంది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి. హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 19, 2023న విడుదలవుతుందని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఇక సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో మరో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందనే రేంజ్ లో వస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక ఇప్పటికే వచ్చిన టీజర్ పోస్టర్ లు అదిరే రెస్పాన్స్ ని అందుకోగా ఇక సినిమా కూడా హ్యాట్రిక్ హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ కూడా ధీమాగా ఉన్నారు. ఇక ఈ చిత్రం లేటెస్ట్ గా అయితే ఓవర్సీస్ డీల్ ని లాక్ చేసుకుంది. ఈ చిత్రం యూఎస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు అయితే ప్రముఖ సంస్థ సరిగమ సినిమాస్ వారు కొనుగోలు చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రానికి అయితే భారీ మొత్తంలో డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ అక్టోబర్ 18 నుంచి అయితే ఈ చిత్రం ప్రీమియర్స్ యూఎస్ లో పడనున్నాయి


Tags

Read MoreRead Less
Next Story