Thaman: తమన్‌కు అనంత శ్రీరామ్ స్పెషల్ గిఫ్ట్.. దాంతో పాటు 'సర్కారు వారి పాట' అప్డేట్..

Thaman: ప్రస్తుతం టాలీవుడ్‌లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు ఎస్ ఎస్ తమన్. స్టార్ హీరోల దగ్గర నుండి యంగ్ హీరోల వరకు అందరికీ సెన్సేషనల్ మ్యూజిక్‌ను అందిస్తూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేస్తున్నాడు తమన్. అందుకే తమన్‌కు పాపులర్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ఓ స్పెషల్ గిఫ్ట్‌ను ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు తమన్.
ఒకప్పుడు ఎవరైతే తనను నెగిటివ్‌గా కామెంట్ చేశారో.. ఇప్పుడు వారినే అభిమానులుగా మార్చుకుంటున్నాడు తమన్. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో అభిమానులు ఎలాంటి సంగీతం అయితే ఆశిస్తారో అంతకు మించి అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట'కు సంగీతాన్ని అందిస్తున్నాడు తమన్. తను అనంత శ్రీరామ్ గిఫ్ట్‌తో పాటు ఈ సినిమాలోని తరువాతి సాంగ్ అప్డేట్‌ను కూడా ఇచ్చేశాడు.
తమన్ ఒక ఆల్ రౌండర్. క్రికెట్‌ను బాగా ఇష్టపడతాడు. బ్యాటింగ్ చేయడం చాలా ఇష్టం. అందుకే తమన్‌కు స్పెషల్‌గా తయారు చేసిన బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు అనంత శ్రీరామ్. ఇక ఈ వీడియోను తన ట్విటర్‌లో షేర్ చేసిన తమన్.. 'మీరు నా రోజును పూర్తిచేశారు అనంత్. తొందరగా వచ్చేయండి సర్కారు వారి పాట నుండి మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్'ను విడుదల చేద్దాం అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో త్వరలోనే పాట రిలీజ్ ఉంటుందని మహేశ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
What a lovely gesture from dearest #ananthsriram gaaru ❤️
— thaman S (@MusicThaman) April 25, 2022
U made my day dear Ananth. Come soon let's release the #MassSongoftheYear from #SarkaruVaariPaataMusic 🔥🧨🧨🧨🧨💣💣💣 #Gratitude #Happiness 🏆 pic.twitter.com/asPO784KPu
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com