Thaman: జయసూర్య పాత్ర రాసింది ఒకరి కోసం.. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యింది మరొకరితో..

Thaman (tv5news.in)
Thaman: దర్శకులు.. తమకు బయట ఎవరైనా నచ్చినా,, నచ్చకపోయినా.. అది తమ సినిమాల ద్వారానే తెలియజేస్తుంటారు. ముఖ్యంగా ఆ కళలో సుప్రసిద్ధుడు శ్రీను వైట్ల. తన సినిమాలో ఏదో ఒక పాత్ర కచ్చితంగా ఒక సినీ సెలబ్రిటీపై సెటైర్ వేసినట్టే ఉంటుంది. అలా వైట్ల రాసిన ఎన్నో పాత్రల్లో.. ఇప్పటి మీమ్ వరల్డ్‌లో కింగ్‌లాగా వెలిగిపోతున్న పాత్ర 'కింగ్' సినిమాలోని మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య పాత్ర. ఈ పాత్ర గురించి ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు దర్శకుడు శ్రీను వైట్ల.
కింగ్ సినిమాలో బ్రహ్మానందం పోషించిన జయసూర్య పాత్ర ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా ప్రేక్షకులను నవ్వించడంలో మాత్రం ఫెయిల్ అవ్వలేదు. అందులో ఆయన చెప్పే డైలాగులు, మ్యానరిజం అన్ని రియల్ లైఫ్‌లో తమన్‌ను పోలి ఉంటాయని నెటిజన్లు అప్పట్లో తెగ వైరల్ చేశారు. రీల్ లైఫ్‌లో జయసూర్య అయితే రియల్ లైఫ్‌లో తమన్ అని పోలికలు కూడా చేశారు.
శ్రీను వైట్ల మాత్రం తన మనసులో వేరే మ్యూజిక్ డైరెక్టర్‌ను ఊహించుకుని జమసూర్య పాత్రను డిజైన్ చేశారట. వైట్ల తెరకెక్కించిన 'ఢీ' సినిమా సూపర్ హిట్‌ను సాధించింది. ఇందులో కామెడీనే ప్లస్ పాయింట్. ఈ సినిమాకు చక్రి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో చక్రి ప్రవర్తన వైట్లకు అసలు నచ్చలేదట. అందుకే ప్రతీకారంగా జయసూర్య పాత్రను రాసినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
జయసూర్య పాత్ర రాసింది ఒకరిని దృష్టిలో పెట్టుకుని అయితే.. ప్రేక్షకులు మాత్రం తమన్‌కు కనెక్ట్ అయ్యారంటూ శ్రీను వైట్ల కమెంట్ చేశారు. నెటిజన్లు ఇంకా ఏ ఇతర మ్యూజిక్ డైరెక్టర్‌ను ట్రోల్ చేయనంతగా తమన్‌ను ట్రోల్ చేస్తారు. అంతే కాకుండా ఆయన మ్యూజిక్‌కు ఎక్కువమంది ఫ్యాన్స్ ఉంటారు కూడా. ఇటీవల తమన్ ఇస్తున్న ఛార్ట్‌బస్టర్స్ ఇంకే మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com