పబ్లిసిటీ కోసం భారీగా ఖర్చుపెడుతున్నారు... సినిమాలో దమ్ముంటే అదే ఆడుతుంది : తమ్మారెడ్డి

Thammareddy Bharadwaja : కరోనా ప్రభావం కారణంగా సినిమా పరిశ్రమ నష్టాల్లో ఉందన్నారు సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. నష్టాల కారణంగానే టికెట్ల ధరలు పెంచాలని డిమాండ్ వస్తుందన్నారు. అయితే ఈ భారాన్ని ప్రజలపై మోపకుండా.. దర్శకులు ఖర్చుతగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సినిమా పబ్లిసిటీకోసం భారీగా ఖర్చుపెడుతున్నారని.. సినిమాలో దమ్ముంటే అదే ఆడుతుందన్నారు. ప్రభుత్వం గుర్తించిన కమిటీలతో చర్చిస్తేనే సినిమా ఇండస్ట్రీ సమస్య పరిష్కారమవుతుందన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. తనను, చిరంజీవిని పిలిచి మాట్లాడినంత మాత్రాన ప్రయోజనం ఉండకపోవచ్చన్నారు. ఈ చర్చల్లో ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వారితో కలిసి చర్చించినప్పుడే మూవీ ఇండస్ట్రీలోని సమస్యలు పరిష్కారం లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com