Nithiin : నితిన్.. హిట్ కొడితే డబుల్ జోష్

తెలంగాణ నుంచి ఫస్ట్ స్టార్ హీరో అంటే నితిన్ నే చెప్పాలి. ఆ టైమ్ లో తెలంగాణ నుంచి వేరే హీరోలు రాలేదు. వచ్చినా నిలబడలేదు. నితిన్ మాత్రం కెరీర్ లో ఎన్ని ఫ్లాపులు ఉన్నా... మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడూ హిట్స్ కూడా పడుతున్నాయి. ఈ శుక్రవారం అతను హీరోగా నటించిన తమ్ముడు సినిమా విడుదల కాబోతోంది. ఈ తమ్ముడు అతనికి చాలా కీలకమైన సినిమాగా చెప్పొచ్చు. ఇప్పటికే అతని ఖాతాలో వరుసగా ఆరు ఫ్లాపులు ఉన్నాయి. 2020లో వచ్చిన భీష్మ తర్వాత నితిన్ కు హిట్ పడలేదు. తర్వాత వరుసగా వచ్చిన చెక్, రంగ్ దే, మేస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్, రాబిన్ హుడ్ మూవీస్ ఒకదాన్ని మించి ఒకటి పోయాయి. ఉన్నంతలో రంగ్ దే కాస్త ఫర్వాలేదు అనిపించుకుంది. బట్ కమర్షియల్ గా ఫ్లాపే.
ఇక శ్రీ రామ్ వేణు డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించిన తమ్ముడు ఇప్పటికైతే ప్రామిసింగ్ గానే కనిపిస్తోంది. ఓ కొత్త బ్యాక్ డ్రాప్ లో బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో దర్శకుడు కథ చెప్పబోతున్నాడు అనిపిస్తోంది. అలాగే ఫీమేల్ లీడ్ లో నటిస్తోన్న వారి పాత్రలు కూడా బలంగానే ఉండబోతున్నాయి అనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ కనిపిస్తోంది. ఇన్ని ఫ్లాపులు ఉన్నా.. ఈ మూవీ బడ్జెట్ విషయంలో దిల్ రాజు చాలా ధైర్యం చేశాడు అనే చెప్పాలి. నితిన్ కెరీర్ లోనే హయ్యొస్ట్ బడ్జెట్ మూవీ తమ్ముడు. ఏకంగా 70 కోట్లు అయిందని చెబుతున్నారు. ప్రస్తుతం నితిన్ ఉన్న ఫామ్ కు ఆ మొత్తం రాబట్టడం దాదాపు అసాధ్యం. అయినా సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే సాధ్యం చేయొచ్చు. అంటే హిట్ అనే మాటే అత్యంత కీలకం.
ఇక ఈ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంటే నితిన్ ఒన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా కనిపిస్తాడు. అంటే ఎన్నాళ్లో వేచిన విజయం వస్తుంది. దాంతో పాటు బడ్జట్ రికవర్ అయితే కెరీర్ బెస్ట్ మూవీగా నిలుస్తుంది. అఫ్ కోర్స్ కలెక్షన్స్ పరంగా చూస్తే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అ ఆ’ మూవీ భారీ విజయమే సాధించింది. కానీ అందులో నితిన్ షేర్ చిన్నదే. తమ్ముడు హిట్ అయితే నితిన్ సోలోగా సాధించినట్టు అవుతుంది. మరి నితిన్ ఈ సారైనా హిట్ అనే మాట వింటాడా లేదా అనేది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com