Thandel : తండేల్ కు కలిసొచ్చిన వాలెంటైన్స్ డే

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ కు ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ నెల 7న విడుదలైన ఈ మూవీ సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీతో చైతూకు ఫస్ట్ 100 క్రోర్ గ్యారెంటీ అనుకున్నారు. ఆ దిశగానే సినిమా వెళుతోంది. అయితే ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా నాలుగైదు రీ రిలీజ్ లు రెండు స్ట్రెయిట్ మూవీస్ ఉన్నాయి. దీంతో తండేల్ 100 కోట్లు ఇంకా ఆలస్యం అవుతుందనుకున్నారు చాలామంది. బట్ ఈ వాలెంటైన్స్ డే మిగతా సినిమాల కంటే తండేల్ కే ఎక్కువ కలిసొచ్చింది. రిలీజ్ అయిన మూవీస్ లో ఒక్క ఆరెంజ్ కు తప్ప దేనికీ సరైన టాక్ కూడా రాలేదు. ముఖ్యంగా స్ట్రెయిట్ రిలీజ్ మూవీస్ కు ఫ్లాప్ టాక్ వచ్చింది. రీ రిలీజ్ ల ప్రభావం పెద్దగా కనిపిస్తుందనుకోలేం. ఇవి కేవలం వాలెంటైన్ డే టార్గెట్ గానే వచ్చాయి. సో.. ఇక తండేల్ కు తిరుగులేకుండా పోయిందనే చెప్పాలి.
ఈ వీకెండ్ అంతా కూడా బుక్ మై షోతో పాటు అన్ని థియేటర్స్ లో తండేల్ హవానే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఈ మూవీ మరింత ఆదివారం వరకే 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుంది అనుకోవచ్చు. శ్రీకాకుళంలోని కొందరు జాలర్లు పాకిస్తాన్ కు చిక్కి రెండేళ్ల పాటు బందీలుగా ఉన్న కథను ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని యాడ్ చేసి చందు మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్ గా నిలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com