Thandel Collections : తండేల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి రూపొందించిన సినిమా తండేల్. భారీ అంచనాలు మధ్య ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మంచి ఓపెనింగ్స్ కూడా దక్కాయి. కొన్ని చోట్ల విమర్శలున్నా.. నాగ చైతన్య, సాయి పల్లవిల అధ్భుతమైన నటనతో కట్టి పడేశారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ లా పనిచేస్తోందనే కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ మూవీతో 100 కోట్లు కొట్టబోతున్నాం అని నిర్మాత బన్నీ వాసు బలంగా చెప్పాడు. మరి ఈ మూవీ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందో తెలుసా..
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తండేల్ కు 13 కోట్లకు పైగా గ్రాస్ వసూలైందని టాక్.ఏపిలో టికెట్ రేట్లు పెంచినా.. ఇందులో మేజర్ షేర్ నైజామ్ నుంచే ఉండటం విశేషం.అయితే ఈ ఫిగర్స్ మేకర్స్ కు అంత సంతృప్తిని ఇవ్వకపోవచ్చేమో కానీ.. మౌత్ టాక్ తో పాటు పాజిటివ్ రివ్యూస్ ఈ కలెక్షన్స్ ను మరింత పెంచబోతున్నాయని చెప్పొచ్చు. ఓవర్శీస్ తో పాటు మిగతా భాషల నుంచి కలిపి నిర్మాత బన్నీ వాసు చెప్పినట్టు 100 కోట్ల గ్రాస్ ఫిగర్ ను టచ్ చేసే అవకాశాలున్నాయి. అందుకోసం ఇతర రాష్ట్రాల్లో మినిమం వసూళ్లైనా వస్తుండాలి. అప్పుడే సాధ్యం అవుతుంది. అలాగే ఓవర్శీస్ కూడా కీలకంగా ఉంటుంది. మొత్తంగా తండేల్ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుందాం అంటే.. సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే కాస్త తగ్గాయనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com