Naga Chaitanya : నాగ చైతన్య తండేల్ అప్డేట్ ఇచ్చారు

Naga Chaitanya :  నాగ చైతన్య తండేల్ అప్డేట్ ఇచ్చారు
X

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కొత్త సినిమా తండేల్ ఎప్పుడు విడుదలవుతుంది..? అతని ఫ్యాన్స్ లో కనిపిస్తోన్న పెద్ద డౌట్ ఇది. ఈ డౌట్ ను క్లియర్ చేస్తూ దర్శకుడు అప్డేట్ ఇచ్చాడు. బట్ రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. మొదటి నుంచి తండేల్ ను డిసెంబర్ 20న విడుదల చేస్తాం అని చెప్పారు. బట్ ఈ డేట్ మారింది అనేది దర్శకుడు చెప్పిన మాట. తాజాగా ఓ మూవీ ఫంక్షన్ కు గెస్ట్ గా వచ్చిన దర్శకుడు చందు మొండేటి ఈ మాట చెప్పాడు. తమ సినిమా ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలన్స్ ఉందట. అయినా జనవరి వరకూ రెడీగా ఉంటాం అన్నాడు. అంటే విఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ కోసం ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారా లేక అంతా అనుకుంటున్నట్టు సంక్రాంతినే టార్గెట్ చేసుకున్నారా అనేది తెలియాలి. చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. బన్నీ వాస్ నిర్మాత.

కొన్నాళ్ల క్రితం శ్రీకాకుళం జాలరులు పాకిస్తాన్ సైన్యానికి బందీలుగా చిక్కారు. చేపల వేటకు వెళ్లిన వీళ్లు సముద్రంలో దారి పాక్ జలాల్లోకి వెళ్లారు. వీరిని సీక్రెట్ ఏజెంట్స్ గా భావించిన పాక్ బందీలుగా తీసుకుంది. విషయం భారత్ హై కమాండ్ కు తెలియడంతో అనేక చర్చల తర్వాత వీరిని తిరిగి భారత్ కు తీసుకువచ్చారు. ఆ కథనే తండేల్ గా రూపొందిస్తున్నాడు దర్శకుడు చందు మొండేటి.

విశ్వంభర పోస్ట్ పోన్ అయిన తర్వాత చాలామంది తండేల్ ను సంక్రాంతికే విడుదల చేస్తున్నారు అనుకున్నారు. సంక్రాంతి టైమ్ లో అయితే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని భావిస్తున్నట్టు సమాచారం. బట్ అదే టైమ్ కు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ కొత్త సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ బరిలో తండేల్ ఉంటుందా లేక జనవరిలోనే మరో డేట్ కు వెళుతుందా అనేది చూడాలి.

Tags

Next Story