Thandel OTT : తండేల్ ఓటిటి ఎంట్రీ ఎప్పుడు..?

Thandel OTT :  తండేల్ ఓటిటి ఎంట్రీ ఎప్పుడు..?
X

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి డైరెక్ట్ చేసిన సినిమా తండేల్. బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్ గా 100 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. ఇది చైతన్యకు ఫస్ట్ సెంచరీ మూవీ. నాగ చైతన్యకు నటనకు గొప్ప ప్రశంసలు కూడా వచ్చాయి. అతని కెరీర్ లో ఇది పాథ్ బ్రేకింగ్ మూవీ అని చెప్పొచ్చు. సాయి పల్లవి ఎప్పట్లానే అదరగొట్టింది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో ఈ లవ్ స్టోరీని నెక్ట్స్ లెవల్ లో నిలిపాడు.

అయితే ఈ మూవీని విపరీతంగా ఇష్టపడ్డవాళ్లు ఓటిటి కోసం చూస్తున్నారు. అలాగే థియేటర్స్ లో చూడని వాళ్లు కూడా ఎప్పుడెప్పుడు ఓటిటిలో వస్తుంద అని ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ ఓటిటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. వారి రూల్స్ ప్రకారం మార్చి ఫస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలున్నాయి. అంటే మార్చి 7 నుంచి అనే టాక్ వినిపిస్తోంది. మరి అదే డేట్ నుంచి స్ట్రీమ్ అవుతుందా లే కొత్త డేట్ ఏదైనా ప్రకటిస్తారా అనేది చూడాలి.

Tags

Next Story