Thandel Song : దసరాకు తండేల్ సాంగ్!
నాగచైతన్య చందుమొండేటి కాంబోలో వస్తున్న సినిమా తండేల్. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతున్న ఈ సినిమాకు సంబంధిం చిన ఓ పాటను దసరా సందర్భంగా రీలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ని శ్రీకాకుళం జిల్లా డి. మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ తండేల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితాల్లో సంభవించిన పరిస్థితులు, భావోద్వేగాలు ఇతర పరిస్థితులను చాలా గ్రిప్పింగ్గా, ఆకర్షణీయంగా తెరపై మలుస్తున్నాడు దర్శకుడు చందు మొండేటి. శ్రీకా కుళంలోని పురాతన శివాలయం శ్రీముఖలింగం సన్నిధి లో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహాశి వరాత్రి ఉత్సవాలను ప్రేరణగా తీసుకుని ఈ సినిమా కోసం మునుపెన్నడూ చూడని రీతిలో ఓ ప్రత్యేక శివరాత్రి పాటను చిత్రీకరించారు. ఈ పాటలో నాగ చైతన్య, సాయి పల్ల వితో పాటు వేలాది మంది డ్యాన్సర్లతో కలిసి డ్యాన్స్ చేశారు. అయితే ఈ పాట నాగ చైతన్య సాయి పల్లవిల కెరీర్లోనే మోస్ట్ స్పెషల్ సాంగ్స్ లో ఒకటిగా ఉండబో తుండగా దసరా పర్వదినం సందర్భంగా త్వరలోనే ఈ సాంగ్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడాని కి చిత్ర యూనిట్ ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు తాజాగా పాట షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు. సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com