Thandel Movie : సంక్రాంతి బరిలో తండేల్

Thandel Movie : సంక్రాంతి బరిలో తండేల్
X

అక్కినేని నాగ చైతన్య హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. వాస్తవిక సంఘనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే తండేల్ సినిమాను డిసెంబర్ 20 విడుదల చేయాలని ప్లాన్ చేశారు మామేకర్స్. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు 2025 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతికి గేమ్ ఛేంజర్, NBK 109, వెంకటేష్-అనిల్ రావిపూడి మూవీలు విడుదలకు సిదంగా ఉన్నాయి. దాంతో రానున్న సంక్రాంతికి సినిమాల జాతర మొదలుకానుంది అని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story