Thangalaan : సెన్సార్ కార్యక్రమాలు పూర్తి !

చియాన్ విక్రమ్ (Chiyan Vikram) హీరోగా నటిస్తున్న వెరైటీ పీరియాడికల్ మూవీ తంగలాన్ (Thangalaan). ఈ సినిమా మొదటి నుండి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విక్రమ్ అద్భుతమైన మేక్ఓవర్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్.. ఈ మూవీపై హైప్‌ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లింది. ‘కబాలి, కాలా, సర్పట్టా పరంబరై’ చిత్రాలకు దర్శకత్వం వహించిన పా.రంజిత్ (Pa Ranjith) ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకి దర్శకుడు.
తాజా అప్‌డేట్ ఏమిటంటే, ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. కోలీవుడ్ సమాచారం ప్రకారం సినిమా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 35 నిమిషాలు ఉంటుందని భావిస్తున్నారు. తంగలాన్ ఆగష్టు 15న పాన్ ఇండియా రేంజ్ లో థియేటర్స్ లో సందడి చేయబోతోతోంది. చాన్నాళ్ళ నుంచి సరైన హిట్టే లేని విక్రమ్ ను తంగలాన్.. తిరిగి ఫామ్ లోకి తీసుకొస్తుందని భావిస్తున్నారు.
ఈ పీరియాడికల్ విజువల్ వండర్ లో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. పార్వతి తిరువోతు, పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్, సంపత్ రామ్, హరి కృష్ణన్ కీలక పాత్రలు పోషించారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com